Sarkaru Vaari Paata: మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ను వెంటాడుతున్నఆ బ్యాడ్ సెంటిమెంట్..
Sarkaru Vaari Paata: మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ను వెంటాడుతున్నఆ బ్యాడ్ సెంటిమెంట్..
Sarkaru Vaari Paata: ఇండస్ట్రీలో అన్నింటికంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్. హిట్టు వస్తుందంటే పేరు మార్చుకుంటారు. అవసరమనుకుంటే కలిసొచ్చే సెంటిమెంట్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ అదే బ్యాడ్ సెంటిమెంట్ ఉంటే మాత్రం దాని జోలికి కూడా పోరు.
Sarkaru Vaari Paata: ఇండస్ట్రీలో అన్నింటికంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్. హిట్టు వస్తుందంటే పేరు మార్చుకుంటారు. అవసరమనుకుంటే కలిసొచ్చే సెంటిమెంట్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ అదే బ్యాడ్ సెంటిమెంట్ ఉంటే మాత్రం దాని జోలికి కూడా పోరు.
ఇండస్ట్రీలో అన్నింటికంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్. హిట్టు వస్తుందంటే పేరు మార్చుకుంటారు. అవసరమనుకుంటే కలిసొచ్చే సెంటిమెంట్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ అదే బ్యాడ్ సెంటిమెంట్ ఉంటే మాత్రం దాని జోలికి కూడా పోరు. సినిమా ఇండస్ట్రీ అంటేనే కోట్ల రూపాయలతో ఆడే జూదం కాబట్టి అక్కడ ఎవరి నమ్మకాలు వాళ్లవి. అందుకే సెంటిమెంట్ కూడా బలంగా నమ్ముతారు. స్టార్ హీరోలు కూడా దానికి మినహాయింపు కాదు.
ఉదాహరణకు మహేష్ బాబును తీసుకుంటే ఆయన తన సినిమా ఓపెనింగ్స్ కు రాడు. చాలా ఏళ్లుగా మహేష్ బాబుకు అది ఒక సెంటిమెంట్. తన భార్య నమ్రత మాత్రమే కొత్త సినిమా పూజా కార్యక్రమాలకు వస్తుంది. త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్‌కు కూడా మహేష్ రాలేదు. ఈయన కూడా సెంటిమెంట్స్ బాగానే నమ్ముతాడు. తన సినిమాల విడుదల విషయంలో మహేష్ చాలా జాగ్రత్తగా ఉంటాడు.
అలాంటిది ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా విషయంలో మాత్రం ఎందుకో అభిమానులను కాస్త కంగారు పెడుతున్నాడు సూపర్ స్టార్. ఈ సినిమా మే 12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు అనే ఆనందం కంటే మరో టెన్షన్ మహేష్ అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అదే మే నెల బ్యాడ్ సెంటిమెంట్. మహేష్ బాబు కెరీర్లో మే అంతగా కలిసి రాలేదు. ఆ నెలలో వచ్చిన కొన్ని సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. అందుకే మే అంటే భయపడతారు ఫ్యాన్స్.
2016 మే 20న విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఎంత దారుణంగా నిరాశపరిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా ఆకాశమంత అంచనాలతో వచ్చి పాతాళానికి పడిపోయింది. మహేష్ కెరీర్లో ఇంతకంటే దారుణమైన డిజాస్టర్ మరొకటి లేదు. సినిమాను కనీసం చివరి వరకు కూడా చూడలేనంత దారుణంగా ఉంటుంది బ్రహ్మోత్సవం.
ఇక 2004 మే 14న విడుదలైన నాని కూడా ఫ్లాప్ అయ్యింది. ఖుషి లాంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు ఎస్ జై సూర్య తెలుగులో తెరకెక్కించిన రెండో సినిమా ఇది. నాని సినిమాతో మహేష్ బాబు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ విజయం మాత్రం అందుకోలేకపోయాడు.
2003 మే 23న విడుదలైన నిజం సినిమా పరిస్థితి కూడా ఇంతే. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. కానీ సినిమా ఫలితం మాత్రం ఫ్లాప్. ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత భారీ అంచనాలతో వచ్చిన నిజం అంచనాలు అందుకోలేదు. ఈ మూడు సినిమాలు కూడా మే నెలలోనే వచ్చాయి.
అందుకే మహేష్ బాబు అభిమానులకు మే అంటే అంత భయం. అయితే వాళ్లకు ఊరటనిచ్చే ఒకే ఒక అంశం ఏంటంటే మహర్షి సినిమా కూడా మే నెలలోనే విడుదల కావడం. 2019 మే 9న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సూపర్ స్టార్ 25 సినిమాగా వచ్చిన మహర్షి 100 కోట్లకు పైగా వసూలు చేసింది. వంశీ పైడిపల్లి దీనికి దర్శకుడు.
ఈ నమ్మకంతోనే ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాను కూడా మే 12న విడుదల చేయబోతున్నారు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిజినెస్ 100 కోట్లకు పైగా జరుగుతుంది. మొత్తానికి కలిసిరాని నెలలో వస్తున్న సర్కారు వారి పాట బాక్సాఫీస్ మూత ఎలా ఉండబోతుందో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.