Home /News /national /

MAHATMA GANDHI HEALTH BULLITEN RELEASED IN NEW DELHI AFTER 80 YEARS MK

మహాత్మా గాంధీకి బీపీ, షుగర్‌లు ఉన్నాయా ?...ఆసక్తి రేపుతున్న మహాత్ముడి హెల్త్ బులిటెన్...

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

    జాతిపిత మహాత్మాగాంధీ జీవితం గురించి ప్రతీ అంశమూ ఆసక్తిదాయకమే...ఆయన జీవన విధానం, నడవడిక ప్రతీ ఒక్కటి కథకథలుగా భవిష్యత్ తరాలకు చెబుతుంటారు. మరి అలాంటి వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉండేది అనే విషయాన్ని నిర్ధారించే హెల్త్ బులిటెన్ ఇటీవల పుస్తకం విడుదలైంది. ఢిల్లీలోలోని నేషనల్ గాంధీ మ్యూజియంలో దశాబ్దాలుగా ఆర్కైవ్స్ గా ఉంచిన మహాత్ముడి ఆరోగ్య వివరాలను భారత వైద్య పరిశోధనా మండలి పుస్తకంగా "మహాత్మ ఎట్ 150" పేరిట పబ్లిష్ చేసింది.

    అందులో ప్రధానంగా మహాత్మ గాంధీ తన జీవిత కాలంలో మూడు సార్లు మలేరియా జ్వరంతో బాధపడినట్లు పేర్కొన్నారు. అంతే కాదు మహాత్ముడి ఎత్తు బరువు కూడా వెల్లడించారు. గాంధీజీ 5.5 అడుగుల ఎత్తు, 17.1 పాయింట్ల బీఎంఐ ఉందని, అలాగే ఆయన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. అలాగే మహాత్ముడు 1925,36,44 సంవత్సరాల్లో మలేరియా జ్వరంతో బాధపడగా, మొలల వ్యాధితోనూ, అపెండిసైటిస్ సమస్యతో శస్త్ర చికిత్స సైతం చేయించుకున్నట్లు హెల్త్ బులిటెన్ లో తెలిపారు. అలాగే 1927 నుంచి మహాత్మా గాంధీకి హై బీపీ కూడా గుర్తించినట్లు తెలిపారు.

    అలాగే మహాత్ముడు రోజుకు 18 కిలోమీటర్ల వాకింగ్ చేసేవారని, కొవ్వు శాతం తక్కువగా వుండే మేకపాలు తీసుకునేవారని ఫైల్ చేసింది. అంతే కాదు మహాత్ముడు టీ, కాఫీ, పొగాకు, మద్యానికి దూరంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే సమతుల ఆహారం, నేచురోపతిని మహాత్ముడు ఎక్కువగా విశ్వసించేవారని తెలిపింది.
    First published:

    Tags: Mahatma Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు