షాకింగ్ న్యూస్... మహాత్మాగాంధీ ముని మనవరాలికి 7 ఏళ్లు జైలు శిక్ష... అదే దక్షిణాఫ్రికాలో...

ఆశిష్ లతా రాంగోబిన్ (image credit - twitter)

Mahatma Gandhi: మహాత్మా గాంధీ ముని మనవరాలికి జైలు శిక్షి పడటమేంటి... అసలేం జరిగింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అది కూడా దక్షిణాఫ్రికాలో ఇలా జరగడం పెను దుమారంగా మారింది.

 • Share this:
  Mahatma Gandhi: 56 ఏళ్ల మహాత్మాగాంధీ ముని మనవరాలు... ఓ ఫోర్జరీ కేసులో రూ.3.23 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల మధ్య ఆమెను దోషిగా తేల్చుతూ... డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆశిష్ లతా రామ్‌గోబిన్ (Ashish Lata Ramgobin) ను సోమవారం కోర్టు దోషిగా తేల్చింది. ఆమె వ్యాపారవేత్త SR మహరాజ్‌ను మోసం చేసినట్లు తెలిపింది. ఆమె కోసం ఇండియా నుంచి వచ్చే ఓ కన్‌సైన్‌మెంట్ కోసం.... ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించేందుకు మహరాజ్... ఆమెకు అడ్వాన్స్‌గా రూ.3.23 కోట్లు (62 లక్షల ర్యాండ్లు) ఇచ్చాడు. ఆ కన్‌సైన్‌మెంట్ ద్వారా వచ్చే లాభాల్లో కొంత ఆయనకు లభిస్తుంది. ఐతే... అసలా కన్‌సైన్‌మెంటే లేదనీ.... అలా అడ్డగోలు నకిలీ బిల్లులు సృష్టించి... ఆమె ఆయన్ని మోసం చేశారని తేలింది.

  ప్రముఖ హక్కుల పోరాట యోధురాలు ఎలా గాంధీ, దివంగత మేవా రామ్‌గోబింద్‌ల కూతురే ఆశిష్ లతా రాంగోబిన్. ఈ కేసు విచారణ 2015లోనే ప్రారంభమైంది. ఆమె మోసపూరిత చర్యలో భాగంగా... లేని కన్‌సైన్‌మెంట్ ఉన్నట్లుగా చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్‌లు, డాక్యుమెంట్లు సృష్టించారని తెలిసింది. మూడు కంటైనర్లు ఇండియా నుంచి షిప్పులో వస్తున్నట్లు ఆమె తెలిపారని తెలిసింది.


  ఈ కేసులో అరెస్ట్ అయ్యాక ఆమె... 50,000 ర్యాండ్లు (దక్షిణాఫ్రికా కరెన్సీ) పూచీకత్తుగా చెల్లించి బెయిల్‌పై విడుదల అయ్యారు. 2015 ఆగస్టులో ఆశిష్ లతా... మహరాజ్‌ను కలిశారు. ఆయన న్యూ ఆఫ్రికా ఎలియాన్స్ ఫుట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థకు డైరెక్టర్. ఈ కంపెనీ... క్లాథింగ్, లైనెన్, ఫుట్‌వేర్లను దిగుమతి, తయారీ, అమ్మకం చేస్తుంది. అలాగే ఈ కంపెనీ ఇతర వ్యాపారులకు ఆర్థిక సాయం చేస్తుంది. ఆ తర్వాత వచ్చే లాభాల్లో కొంత భాగం పొందుతుంది. అందులో భాగంగానే లతా... తాను సౌత్ ఆఫ్రికన్ హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్ కోసం... 3 కంటైనర్లలో లైనెన్ (Linen)ను ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది. దిగుమతి చేసుకునేటప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించాలి. ఆ డబ్బు తన దగ్గర లేదని ఆమె మహరాజ్‌కు చెప్పి సాయం కోరారు. ఆమె చూపించిన నకిలీ ఇన్వాయిస్ ఆధారంగా ఆయన మనీ ఇచ్చినట్లు తెలిసింది.

  ఇది కూడా చదవండి: Horoscope 8-6-2021: నేటి రాశి ఫలాలు... వీరికి ఆదాయ వృద్ధి, నిలకడైన లాభాలు

  ఇదే దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ... లా వృత్తిని కొనసాగిస్తూ... ఎంతో మంది పేదల తరపున వాదించారు. అలాగే... గాంధీజీ మనవరాలైన ఎలా గాంధీ సైతం... తన పోరాట సేవలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొంది... ఇండియా, దక్షిణాఫ్రికాల నుంచి సత్కారాలు పొందారు. ఆమె కూతురైన ఆశిష్ లతా మాత్రం మోసపూరిత కేసులో జైలుపాలయ్యారు.
  Published by:Krishna Kumar N
  First published: