Mahatma: గాంధీజీ వర్ధంతి నాడు.. గాడ్సే అమర్‌రహే అంటున్న కొందరు నెటిజన్లు.. ఎందుకంటే

మహాత్మా గాంధీజీ, నాథూరామ్ గాడ్సే (File)

#NathuramGodseAmarRahe: నెటిజన్లు ఎప్పుడూ నిరాశ పరచరు. ట్రెండ్‌కి తగ్గట్టు ఏదో ఒకటి వైరల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారు నాథూరామ్ గాడ్సేని అమర్ రహే అని ఎందుకంటున్నారో తెలుసుకుందాం.

  • Share this:
    యావత్ దేశం, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మహాత్మాగాంధీ 73 వర్ధంతి (death anniversary)ని జరుపుకుంటోంది. అందువల్ల జనరల్‌గా ఇవాళ జాతిపిత ట్రెండింగ్‌లో ఉండాలి. అలాంటిది మహాత్ముడిని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే ట్రెండింగ్‌లో నిలవడం షాకింగ్ విషయమే. ట్విట్టర్‌లో #NathuramGodseAmarRahe అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఓ యూజరేమో... దేశాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు నాథూ భాయ్ అని కామెంట్ రాయగా... ఇది ఇవాళ ఎందకు ట్రెండింగ్ అవుతోందో నాకు అర్థం కాలేదు అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. 1948 జనవరి 30న మహాత్మా గాంధీని అత్యంత దగ్గరి నుంచి నాథూరామ్ గాడ్సే కాల్చిచంపాడు. ఎందుకూ అంటే... దేశాన్ని విభజించడం తనకు నచ్చలేదని అన్నాడు.

    మనందరికీ తెలుసు... భారత జాతీయోద్యమంలో, స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ ప్రధాన పాత్ర పోషించారు. అహింస, శాంతియుత పద్ధతులను పాటించి... నెత్తుటి చుక్క రాలకుండా స్వాతంత్ర్యం సిద్ధించేలా చేశారు. ఈ పోరాటంలో గాంధీజీతోపాటూ ఎంతో మంది ప్రముఖులు, ప్రజల త్యాగాలున్నాయి. అలాంటిది ఆయన్ని చంపేసిన గాడ్సే... హిందువులను కాపాడారనీ, దేశాన్ని కాపాడారని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. నా దృష్టిలో ఈ దేశ జాతిపిత గాంధీజీ కాదు... నాథూరామే అని ఓ యూజర్ అన్నారు.

    టాలీవుడ్ నటుడు సిద్ధార్థ మాత్రం గాడ్సేను ఓ పిరికిపంద అని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు.


    మరో యూజర్ కూడా మన దేశ ప్రముఖ పౌరుడు ఎక్కడ? ప్రజలు గాంధీజీ హత్యను వేడుకలా చేసుకుంటున్నారు. ఆయన్ని చంపేసిన హంతకుణ్ని మెచ్చుకుంటున్నారు.

    ఈ నెల ప్రారంభంలో అఖిల భారతీయ హిందుమహాసభ గాడ్సే జ్ఞానశాల అనే లైబ్రరీని తన గ్వాలియర్‌ ఆఫీసులో ప్రారంభించింది. కానీ రెండ్రోజుల తర్వాత పోలీసులు ఆ లైబ్రరీని మూసేసి, అందులో పుస్తకాల్ని సీజ్ చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందనే అలా చేసినట్లు తెలిపారు.

    గాంధీజీ ఆశయాలు కోట్ల మందికి ప్రేరణ కలిగిస్తాయి: ప్రధాని మోదీ
    మహాత్మాగాంధీజీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయాలు కోట్ల మందికి ప్రేరణ కలిగిస్తాయి అని అన్నారు.


    ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా జాతిపితకు నివాళులు అర్పించారు. "ప్రజా మద్దతు లేకపోయినా.. నిజం నిలబడుతుంది. అది దానంతట అది నిలదొక్కుకోగలదు" అన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యల్ని రాహుల్ ప్రస్తావించారు.


    మొత్తానికి నెటిజన్లు ఈసారి ఇలా కొత్త యాంగిల్ అందుకున్నారు. దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా వస్తున్న ట్వీట్లు, కామెంట్లతో ట్విట్టర్ హోరెత్తుతోంది.
    Published by:Krishna Kumar N
    First published: