ఆ ఊళ్లో పాలు అమ్మరు.. ఉచితంగా పంచుతారు.. ఎందుకో తెలుసా?

ఓ ఊరి ప్రజలు మాత్రం పాలను ఉచితంగా పంచుతున్నారు. ఏదో ఒక్కరోజో రెండు రోజులో కాదు... ఎప్పుడూ ఫ్రీగానే పంపిణీ చేస్తారు.

news18-telugu
Updated: August 11, 2020, 9:31 PM IST
ఆ ఊళ్లో పాలు అమ్మరు.. ఉచితంగా పంచుతారు.. ఎందుకో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రస్తుతం లీటర్ గేదె పాలు రూ.50పైనే ఉంది. మంచి నాణ్యమైన పాలైతే 70 నుంచి 80 రూపాయల వరకు పలుకుతుంది. ఇంకా పాల ధరలను పెంచాలని ఇటీవల పాడి రైతులు ఆందోళన చేశారు. కానీ ఓ ఊరి ప్రజలు మాత్రం పాలను ఉచితంగా పంచుతున్నారు. ఏదో ఒక్కరోజో రెండు రోజులో కాదు... ఎప్పుడూ ఫ్రీగానే పంపిణీ చేస్తారు. అదే యెలేగావ్ గావాలీ గ్రామం. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉందీ ఊరు. మరి ఈ ఊరి ప్రజలు పాలను ఎందుకు ఉచితంగా పంచుతారో తెలుసా? దానికీ ఓ చరిత్ర ఉంది.

యెలేగావ్ గ్రామంలో 550 వరకు ఇళ్లు ఉంటాయి. అందులో 90శాతం మందికి ఆవులు, గేదెలు, మేకలు ఉన్నాయి. అందరి ఇళ్లల్లోనూ పుష్కలంగా పాలు ఉంటాయి. ఈ ఊరి ప్రజలు తాము గోపాల కృష్ణుడి వారసులుగా చెప్పుకుంటారు. కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఇష్టమైన దైవం శ్రీ కృష్ణుడు. అందుకే గోపాలుడి వారసులుగా తాము ఉచితంగా పాలను పంచుతామని.. ఇంత వరకు ఎవరూ పాలను అమ్మలేదని స్థానికులు చెబుతారు.

'మా గ్రామం యెలెగావ్ గావాలీకు పాడి రైతుల గ్రామమని అర్ధం. మేం శ్రీకృష్ణుడి వారసులం. అందుకే మేం పాలను అమ్మబోము' అని యెలెగావ్ గావాలీ గ్రామానికి చెందిన రాజాబో మందాడె (60) చెప్పారు. దాదాపు అందరి ఇళ్ల్లో పాలు ఉంటాయని.. ఈ నేపథ్యంలో పాలు లేని వారికి తాము ఉచితంగానే ఇస్తామని తెలిపారు. ఇక శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు. గ్రామంలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో ఊరు ప్రజలంతా పోగై వేడుకను చేసుకుంటారు. కానీ ఈసారి కోవిడ్ నిబంధనల నేపథ్యంలో సాదాసీదాగా జన్మాష్టమి వేడుకలను జరుపుకున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 11, 2020, 9:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading