• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MAHARASHTRAS 50000 YEAR OLD LONAR LAKE MYSTERIOUSLY TURNS PINK SCIENTISTS PROBE CAUSE SK

గులాబీ రంగులోకి మారిన 50వేల ఏళ్ల నాటి చెరువు.. ఈ మిస్టరీ ఏంటి?

గులాబీ రంగులోకి మారిన 50వేల ఏళ్ల నాటి చెరువు.. ఈ మిస్టరీ ఏంటి?

లోణార్ సరస్సు

లోణార్ సరస్సుకు 50వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన ఓ ఆస్టరాయిడ్ (గ్రహ శకలం) భూమిని బలంగా ఢీకొనడంతో లోణార్ సరస్సు ఏర్పడిందని చరిత్ర చెబుతోంది.

  • Share this:
    లోణార్ సరస్సు..! మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో.. ముంబైలోకి 500 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 383 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న లోణార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇదొక భాగం. 1.2 కిలో మీటర్ల వ్యాసంతో ఉన్న లోణార్ సరోవరం.. చుట్టుపక్కల పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలతో.. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి నిత్యం ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ లోణార్ సరస్సుకు 50వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన ఓ ఆస్టరాయిడ్ (గ్రహ శకలం) భూమిని బలంగా ఢీకొనడంతో లోణార్ సరస్సు ఏర్పడిందని చరిత్ర చెబుతోంది.

    మహారాష్ట్రలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న లోణార్ సరస్సు ఇటీవల గులాబీ రంగులోకి మారుతోంది. చెరువులో ఉన్న నీళ్లన్ని ఎరుపు గులాబీ వర్ణంలోకి మారిపోయాయి. గతంలో పలుమార్లు రంగు మారినప్పటికీ ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. గులాబీ వర్ణలో ఉన్న లోణార్ చెరువు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు స్థానికులు అటవీశాఖకు ఫిర్యాదు చేయగా.. వారు నాగపూర్‌లో నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (NEERI) దృష్టికి తీసుకెళ్లారు.

    మేం సరస్సు నుంచి నీటి శాంపిల్స్‌ను తీసుకుంటున్నాం. వాటిని NEERIకి పంపిస్తాం. అక్కడ నీటిపై పరిశోధనలు జరుగుతాయి. ఆ నీరు గులాబీ వర్ణంలోకి ఎందుకు మారుతుందో రెండు వారాల్లో తెలుస్తుంది.
    ఎంఎస్ రెడ్డి, కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్



    నవీముంబైలోని తలావి వెట్‌లాండ్స్‌లోనూ నీళ్లు గులాబీ రంగులోకి మారుతున్నాయి. ఐతే ఎక్కువ లవణీయత కలిగిన జలాల్లో పెద్ద మొత్తంలో ఆల్గే (ఒక రకమైన బ్యాక్టీరియా) పెరిగినప్పుడు నీరు గులాబీ రంగులోకి మారుతుందని పరిశోధకులు చెప్పారు. ఆ జలాల్లో ఉన్న బీటా కెరోటిన్ వల్ల నీరు గులాబీ రంగులో కనినిస్తుందని చెప్పారు. తలావీ వెట్లాండ్స్ విషయంలో ఇదే జరిగిందని వెల్లడించారు. కానీ లోణార్ సరస్సులో ఉన్న నీటికి లవణీయతతో పాటు క్షార గుణం కూడా ఎక్కువగా ఉందని చెప్పారు. మరి ఇక్కడి జలాలు ఎందుకు గులాబీ రంగులోకి మారుతున్నాయో పరిశోధనల తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు