ఒకటి కాదు,రెండు కాదు.. ఆమెకిది ఎన్నో గర్భం తెలిసి షాక్ తిన్న డాక్టర్స్..

Maharashtra Woman Pregnant for 20th time :మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 38ఏళ్ల మహిళ ఇటీవల ఏడు నెలల గర్భంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది.ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆమె 20వ సారి గర్భం దాల్చినట్టు తెలుసుకుని షాక్ తిన్నారు.

news18-telugu
Updated: September 10, 2019, 8:04 AM IST
ఒకటి కాదు,రెండు కాదు.. ఆమెకిది ఎన్నో గర్భం తెలిసి షాక్ తిన్న డాక్టర్స్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 10, 2019, 8:04 AM IST
మన తాతల కాలంలో ఒక్కో మహిళ 5-10 మంది సంతానాన్ని కలిగి ఉండేవారు. ఆరోజుల్లో అది చాలా సాధారణం.ఇప్పుడు జనరేషన్ మారింది.. ప్రతీ జంట ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే ప్రాధాన్యతనిస్తోంది.పాత కాలంలో లాగా..ఈరోజుల్లో ఒక్కో ఇంట్లో ఐదుగురు,ఆపై సంతానం ఉండటం చాలా అరుదు. అయితే ముంబైకి చెందిన ఓ మహిళ మాత్రం
ఏకంగా 20వ సారి గర్భం దాల్చి వార్తల్లోకి ఎక్కింది.

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 38ఏళ్ల మహిళ ఇటీవల ఏడు నెలల గర్భంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది.ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆమె 20వ సారి గర్భం దాల్చినట్టు తెలుసుకుని షాక్ తిన్నారు. మొత్తం 20సార్లు గర్భం దాల్చగా.. 16సార్లు బిడ్డలకు జన్మనిచ్చిందని.. 3 సార్లు మాత్రం అబార్షన్ అయిందని.. ఇప్పుడు మరోసారి

గర్భంతో ఉందని చెప్పారు. ప్రతీ కాన్పులోనూ ఆమెకు ఒక్కరే జన్మించారని.. పైగా అన్ని కాన్పులు ఇంట్లోనే జరిగాయని తెలిపింది.అయితే ఆమెకు జన్మించిన పిల్లల్లో ఐదుగురు చనిపోయారని.. ప్రస్తుతం 11మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని.. కడుపులో బిడ్డ,తల్లి ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు ఆమెకు అన్ని కాన్పులు ఇంట్లోనే జరిగాయని.. రిస్క్ చేయకుండా ఈసారి మాత్రం ఆస్పత్రిలో చేయించుకోవాలని సూచించామన్నారు.ఎక్కువసార్లు గర్భం దాల్చే కొద్ది గర్భసంచి సాగుతూ ఉంటుందని వైద్యులు తెలిపారు.కాబట్టి ఆ తర్వాత అది సంకోచించడం కష్టమైపోతుందని తెలిపారు. ఎక్కువ కాన్పులతో గర్భసంచి బలహీనపడుతుందని.. అది తీవ్ర రక్తస్రావానికి దారితీస్తుందని చెప్పారు.అలాగే గర్భాశయంలో ఉండే స్కార్ వల్ల గర్భస్థ మాయకు సమస్యల్ని తెస్తుందని చెప్పారు. అందువల్లే ఈసారి కాన్పును ఆస్పత్రిలోనే చేయించుకోవాలని ఆమెకు సూచించామన్నారు.

First published: September 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...