హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Vicco కంపెనీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు.. వీడియో

Vicco కంపెనీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు.. వీడియో

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌ ఎంఐడీసీలోని ప్రసిద్ధ వికో కంపెనీలో మంటలు చెలరేగాయి.

  మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌ ఎంఐడీసీలోని ప్రసిద్ధ వికో కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు పెద్త ఎత్తున ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక, ఈరోజు ఉదయం వికో కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకోవడంతో ప్రమాద తీవ్రత తగ్గింది.

  అయితే వికో కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడటంతో చాలా దూరం వరకు పొగ కమ్ముకుపోయింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లోని స్థానికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, వైద్య సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే కంపెనీలోని ఏ ప్రాంతంలో మంటలు చెలరేగాయనే విషయం తెలియాల్సి ఉంది.

  అలాగే ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది, దానికి గల కారణలేమిటనే దానిపై పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది.

  First published:

  Tags: Fire Accident, Maharashtra

  ఉత్తమ కథలు