దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య పెరుగుతోంది. ట్రాఫిక్ నియమాల పట్ల వాహనదారుల్లో (Of motorists) అవగాహన లేకపోవడం, అలసత్వం వహించడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఏదేమైనా, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వాహనదారుడికి ఉంది. మీరు ట్రాఫిక్ నిబంధలను (Traffic regulations) ఉల్లంఘిస్తే చలాన్ల రూపంలో మీ నుంచి పోలీసులు జరిమానా వసూలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యలో అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా.. వాహనదారులు ఇష్టారాజ్యంగా వెళుతున్నారు. ఇక డిజిటల్ యుగం డెవలప్ అవుతుండటంతో డ్రైవింగ్‌లోనే మొబైల్ ఫోన్ వాడటం (Using a mobile phone while driving).. పాటలు వినడం లాంటివి చేస్తూ డేంజరస్ డ్రైవింగ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వారికి మహారాష్ట్ర ప్రభుత్వం (Government of Maharashtra) అదిరిపోయే షాక్ ఇచ్చింది. సెంట్రల్ మోటర్ వెహికల్ చట్టం (Central Motor Vehicle Act) 2021 అమలు చేయాలని మహారాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంఘిస్తే భారీగానే జరిమానాలను విధిస్తారు. ఈ మేరకు మహారాష్ట్ర రవాణా శాఖ డిసెంబర్ 1న నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది.
ప్రమాదాల దృష్ట్యా..
తొలుత మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని (law) అమలు చేసేందుకు విముఖత చూపినా.. రాష్ట్రంలో తరచూ జరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు (Traffic violations), పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా దీన్ని అమలు చేసేందుకు రవాణా శాఖ సంకల్పించింది. దీని ప్రకారం గురువారం కొత్త నిబంధనల నోటిఫికేషన్ విడుదలైంది. నిబంధనలను ఉల్లంగించిన ద్విచక్ర వాహనాలకు వెయ్యి, ఫోర్ వీలర్ వాహనాలకు రెండు వేలు, ఇతర భారీ వాహనాలు నడిపేవారు రూ. 4 వేలు చొప్పున జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుమునుపు కేవలం రూ.500 మాత్రమే జరిమానాగా విధించేవారు.
వాహనాలకు రిఫ్లెక్టర్ లేకపోయినా..
ఈ చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంగించినా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపినా (If driving while using phone) బుక్ అవ్వాల్సిందే! వాహనాలకు రిఫ్లెక్టర్ లేకపోయినా, ఫ్యాన్సీ నెంబర్ ఫ్లేట్స్ అమర్చినా.. వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. గతంలో ఇందుకు రెండువందల రూపాయలు జరిమానాగా విధించేవారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనాలకు నడిపిన వారికి ఏకంగా రూ.5 వేలు జరిమానా తప్పదు. కాగా మోటారు వాహనాల చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం జరిమానా మొత్తాన్ని పెంచారు. ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను అమలు చేయడానికి వెనుకాడింది. ఐతే తాజాగా వాటిని అమలు చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharashtra, Police, Traffic challans, Traffic police, Traffic rules