పదో తరగతి వరకు మాతృభాష తప్పనిసరి... ఆ రాష్ట్రం సంచలన నిర్ణయం...

మహారాష్ట్రలో సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు ప్రస్తుతం నాలుగో తరగతి వరకు మరాఠీను తప్పనిసరిగా బోధిస్తున్నాయి. ఆ తర్వాత నుంచి ఆప్షన్ ఇచ్చాయి.

news18-telugu
Updated: February 10, 2020, 10:55 PM IST
పదో తరగతి వరకు మాతృభాష తప్పనిసరి... ఆ రాష్ట్రం సంచలన నిర్ణయం...
ప్రతీకాత్మక చిత్రం (Image;Facebook)
  • Share this:
ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలోనూ పదో తరగతి వరకు తప్పనిసరిగా మరాఠీ ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును త్వరలో అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతున్నారు. మహారాష్ట్రీయుల మాతృభాష మరాఠీ. దీంతో మాతృభాషను కాపాడుకోవాలనే ఉద్దేశంతో శివసేన నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తోంది. ఈ కొత్త బిల్లును ఈనెల 24న మహారాష్ట్ర అసెంబ్లీ ముందుకు తీసుకొస్తున్నారు. మూడు రోజుల పాటు దీనిపై చర్చ జరగనుంది. ఈనెల 27న మరాఠా భాషా దినోత్సవం రోజున దాన్ని అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించనున్నాయి.

సోమవారం జరిగిన అసెంబ్లీ బీఏసీ సమావేశంలో మరాఠా బిల్లును తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. స్కూళ్లలో మరాఠీని తప్పనిసరి చేస్తూ బిల్లు తీసుకురావాలని అజిత్ పవార్ ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇటీవల కాలంలో ఉద్ధవ్ థాక్రే బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే మరాఠా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకి అనుకూలంగా మహా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన్ను ఢీకొట్టడానికి మరాఠా భాషను తప్పనిసరి చేసే బిల్లును తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.

మహారాష్ట్రలో సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు ప్రస్తుతం నాలుగో తరగతి వరకు మరాఠీను తప్పనిసరిగా బోధిస్తున్నాయి. ఆ తర్వాత నుంచి ఆప్షన్ ఇచ్చాయి. ఒకవేళ బిల్లు పాస్ అయితే, తప్పనిసరిగా పదో తరగతి వరకు మరాఠీని బోధించాల్సి ఉంటుంది.

First published: February 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు