హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

MSRTC strike: ఆర్టీసీలో సమ్మె చేసిన ఉద్యోగులపై కొరడా.. 6,277 మంది సస్పెండ్​.. 1496 మంది డిస్మిస్​

MSRTC strike: ఆర్టీసీలో సమ్మె చేసిన ఉద్యోగులపై కొరడా.. 6,277 మంది సస్పెండ్​.. 1496 మంది డిస్మిస్​

ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సు

రవాణా సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు గత నెల రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. దాదాపు 250కి పైగా డిపోలలో సమ్మె ప్రభావం కనిపించింది. దీంతో ప్రభుత్వం కొరడా ఝులిపించింది.

మహారాష్ట్ర (Maharashtra) లో ఎమ్మెస్సార్టీసీ (MSRTC)కి చెందిన ఉద్యోగులు గత అక్టోబర్​ 28 నుంచి సమ్మె (strike) చేస్తున్న సంగతి తెలిసిందే.  దీంతో మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 6,277 మంది ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్‌ (Suspended) చేసింది. రవాణా సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు గత నెల రోజులుగా సమ్మె (MSTRC Strike) నిర్వహిస్తున్నారు. దాదాపు 250కి పైగా డిపోలలో సమ్మె ప్రభావం కనిపించింది. అయితే బస్సులు (busses) ఎక్కువగా తిరగకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు (passengers) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కార్మిక సంఘాలతో సమావేశం..

అయితే ఈ సమ్మె (strike) లో పాల్గొంటున్న ఉద్యోగులపై మహారాష్ట్ర ఆర్టీసీ మండిపడింది. వారిపై క్రమ శిక్షణ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా శనివారం 3,010 మంది ఉద్యోగులను సస్సెండ్‌ చేస్తూ నిర్ణయం (decision) తీసుకుంది. మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. దీంతో ఇప్పటి వరకు సస్సెండ్‌ అయిన ఉద్యోగుల సంఖ్య 6,277కి చేరగా, 1496 మంది కార్మికులు ఉపాధి (Employment) కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులు (employees) వెంటనే విధుల్లో చేరాలని, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉద్యోగుల జీతాల పెంపు..

ఇక మొత్తం 92,266 మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో (RTC employees) 18 వేల వరకు తిరిగి శనివారం విధుల్లో చేరారు. అయితే ఇంకొందరు డ్యూటీ (Duty)లో చేరేందుకు ఈ రోజు వరకు సమయం ఇచ్చింది ప్రభుత్వం.


అలాగే ఉద్యోగుల జీతాల పెంపు (salaries hike) విషయంలో సమీక్షించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వం జీతాల పెంపును ప్రకటించడంతో పలువురు ఉద్యోగులు విధుల్లో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారని మంత్రి (minister) అనిల్​ పరబ్​ తెలిపారు.

కొందరు ఉద్యోగులు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, వారు కూడా వెంటనే చేరాలని మంత్రి కోరారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Maharashtra, Rtc, RTC Strike

ఉత్తమ కథలు