Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    భారీ వర్షంతో ముంబైలో భయానక పరిస్థితులు.. రైల్వే స్టేషన్లో పడవలు

    వర్షాలు తగ్గకపోవడంతో 2005 వరదల తరహాలోనే భారీ ముప్పు పొంచి ఉందని బీఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై ప్రజలను అలర్ట్ చేశారు.

    news18-telugu
    Updated: August 5, 2020, 10:54 PM IST
    భారీ వర్షంతో ముంబైలో భయానక పరిస్థితులు.. రైల్వే స్టేషన్లో పడవలు
    రైల్వే స్టేషన్‌లో పడవలు
    • Share this:
    భారీ వర్షం ముంబైని ముంచెత్తింది. ఎడతెరిపి లేని వానలు, ఈదురు గాలులతో ముంబై మహానగరంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చెంబూర్, పరేల్, హింద్మాత, వడాలా సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల ప్రభావంతో హార్బర్ లైన్‌లోని CSMT-వశీ స్టేషన్లు, మెయిన్ లైన్‌లోని CSMT-కుర్లా, చర్చగేట్-కుర్లా స్టేషన్ల మధ్య సబ్ అర్బన్ రైళ్లను నిలిపివేసింది. ఇప్పటికే పలు రైల్వే స్టేషన్లు వరద నీటితో నిండిపోయాయి. మసీదు-భయ్‌ఖలా స్టేషన్ల మధ్య వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో రెండు రైళ్లు చిక్కుకుపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని పడవల సాయంతో ప్రయాణికులను కాపాడాయి.

    వర్షాలు తగ్గకపోవడంతో 2005 వరదల తరహాలోనే భారీ ముప్పు పొంచి ఉందని బీఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై ప్రజలను అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తగా ఉండాలని.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ముంబైలో వర్షాలపై కేంద్రం ఆరాతీసింది. కేంద్రం తరపున అన్ని విధాలా సాయం చేస్తామని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.
    Published by: Shiva Kumar Addula
    First published: August 5, 2020, 10:53 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading