చైనా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన మహారాష్ట్ర సర్కార్

గ్రేట్ వాల్ మోటార్స్, ఫోటాన్, హెంగ్లీ ఇంజనీరింగ్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను పున:పరిశీలించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

news18-telugu
Updated: June 22, 2020, 3:10 PM IST
చైనా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన మహారాష్ట్ర సర్కార్
ఉద్ధవ్ థాక్రే (ఫైల్ ఫొటో)
  • Share this:
చైనాపై భారతీయులు భగ్గుముంటున్నారు. సరిహద్దుల్లో జవాన్ల ప్రాణాలు తీసుకున్న చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. చైనీస ఉత్పత్తులను వాడబోమంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అు ప్రభుత్వాలు సైతం చైనీస్ కంపెనీలతో డీల్స్ రద్దు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా కంపెనీలతో చేసుకున్న రూ.5వేల కోట్ల ఒప్పందాలను ఉన్నపళంగా నిలిపివేసింది. గ్రేట్ వాల్ మోటార్స్, ఫోటాన్, హెంగ్లీ ఇంజనీరింగ్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను పున:పరిశీలించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మహాష్ట్రలో ఇటీవల మ్యాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పెట్టుబడుల సదస్సు జరిగింది. ఆ సదస్సులో చైనీస్ అంబాసిడర్ సున్ వీడాంగ్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. పుణేలోని తాలేగావ్‌లో ఆటో మొబైల్ ప్లాంటును ఏర్పాటు చేయడానికి రూ.3,770 కోట్లతో గ్రేట్ వాల్ మోటార్స్, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఎంవోయూ, ఫోటాన్‌తో కలిసి పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ స్థాపించాలనుకున్న రూ.1000 కోట్ల విలువజేసే ప్లాంటు ఒప్పందాన్ని, తాలేగావ్ లో హెంగ్లీ ఇంజనీరింగ్ విస్తరణ కోసం కేటాయించిన 250 కోట్ల రూపాయలు పెట్టుబడులను ప్రస్తుతానికి నిలిపివేసింది.

కాగా, గల్వాన్‌ లోయ ఘర్షణ తర్వాత చైనాపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. చైనాపై ఆర్థికపరమైన చర్యలు చేపట్టాలని.. దాదాపు 100 రకాల చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు 5జీతో పాటు ఎలాంటి ఇతర కాంట్రాక్టులను భారత కంపెనీలు సొంతం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లో ఆధునీకరణలో భాగంగా చైనా పరికరాలను ఉపయోగించకూదని టెలికాం మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆదేశించింది.

First published: June 22, 2020, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading