Home /News /national /

MAHARASHTRA POLITICAL CRISIS IAM READY TO RESIGN SAYS UDDHAV THACKERAY AS EKNATH SHINDE IN ASSAM WITH 45 MLAS SK

Maharashtra| Uddhav Thackeray: సీఎం పదవికి రాజీనామా చేసేందుకు రెడీ.. ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు

ఉద్ధవ్ థాక్రే

ఉద్ధవ్ థాక్రే

Maharashtra Political Crisis: ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde).. సీఎం పదవి కోసం కాదని.. శివసేన పార్టీ (Shiv sena Party) కోసమని తెలుస్తోంది. ఇప్పుడున్న పార్టీ బాల్ థాక్రే (Bal Thackeray) నాటి శివసేన కాదని.. ఉద్ధవ్ థాక్రే పార్టీని సర్వ నాశనం చేశారని ఏక్‌నాథ్ షిండే వర్గం ఆరోపిస్తోంది.aఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde).. సీఎం పదవి కోసం కాదని.. శివసేన పార్టీ (Shiv sena Party) కోసమని తెలుస్తోంది. ఇప్పుడున్న పార్టీ బాల్ థాక్రే (Bal Thackeray) నాటి శివసేన కాదని.. ఉద్ధవ్ థాక్రే పార్టీని సర్వ నాశనం చేశారని ఏక్‌నాథ్ షిండే వర్గం ఆరోపిస్తోంది.

ఇంకా చదవండి ...
    ఎమ్మెల్యేలంతా కోరుకుంటే తాను మహారాష్ట్ర సీఎం (Maharashtra CM Uddhav Thackeray) పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ క్యాంప్‌లకు వెళ్లిన ఎమ్మెల్యేంతా వచ్చి..తనతో మాట్లాడాలని  ఆయన అన్నారు. తాను చేసిన తప్పేంటే నిరూపిస్తే.. రాజీనామా చేసేందుకు ఏ మాత్రం వెనకాడనని స్పష్టం చేశారు.  అసోంకి వెళ్లి మాట్లాడాల్సిన అవసరం ఏంటి.. వచ్చి తన ముఖంపై చెబితే...తానే రాజీనామా చేస్తానని ఉద్వేగంగా మాట్లాడారు ఉద్ధవ్ థాక్రే. సీఎం నివాసం నుంచి వెళ్లిపోతున్నట్లు ఆయన చెప్పారు. ఇక హిందూత్వ విషయంలో రాజీపడే విషయమే లేదని ఉద్ధవ్ థాక్రే పదే పదే చెప్పారు. అంతేకాదు.. సీఎం పదవికి రాజీనామా చేస్తానని కూడా  ఆయన తెగేసి చెప్పారు. అవసరమైతే శివసేన (Shiv sena) అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకుంటానని తేల్చిచెప్పారు.

    ''నాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒంట్లో అనారోగ్యంగా ఉంది. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నా. మేం అధికారం చేపట్టాక శివసేన హిందూత్వాన్ని మరిచిపోయిందని చాలా మంది విమర్శిస్తున్నారు. ఇది బాబా సాహెబ్ శివసేన కాదని అంటున్నారు. కానీ హిందూత్వం పట్ల మాకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మేం హిందూత్వాన్ని అనుసరించాం. ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. భవిష్యత్‌లో కూడా హిందూత్వం వెంటే శివసేన ఉంటుంది. శివసేన, హిందూత్వం ఒక నాణేనికి రెండు వైపుల లాంటివి. ఏక్‌నాథ్ షిండే, ఆదిత్య థాక్రే అయోధ్యకు వెళ్లి రామాలయాన్ని సందర్శించారు. సొంత పార్టీ నేతలే నాకు వ్యతిరేకంగా మారడం చూసి షాక్ అయ్యాను. నేను రాజీనామా చేయడమే వారికి కావాలనుకుంటే.. అందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యేలు కోరుకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. గవర్నర్‌ కాల్ చేసి నేను రాజీనామా చేస్తానని చెప్పా. కానీ మీరే వచ్చి రాజీనామా లేఖను ఇవ్వాలని చెప్పారు. నాకు కోవిడ్ ఉండడంతో ఐసోలేషన్‌లో ఉన్నాను. అవసరమైతే శివసేన అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకుంటా. నాకు పదవులు ముఖ్యం కాదు. నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ ఎమ్మెల్యేంతా వచ్చి నాతో మాట్లాడాలి. మేం చేసిన తప్పేంటో చెప్పాలి.'' అని ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు.



    ఐతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde).. సీఎం పదవి కోసం కాదని.. శివసేన పార్టీ (Shiv sena Party) కోసమని తెలుస్తోంది. ఇప్పుడున్న పార్టీ బాల్ థాక్రే (Bal Thackeray) నాటి శివసేన కాదని.. ఉద్ధవ్ థాక్రే పార్టీని సర్వ నాశనం చేశారని ఏక్‌నాథ్ షిండే వర్గం ఆరోపిస్తోంది. హిందూత్వమే ఊపిరిగా బాల్ థాక్రే బతికారని.. కానీ పదవి కోసం ఉద్ధవ్ థాక్రే హిందూత్వ ఎంజెడాను పక్కనబెట్టారని విమర్శలు గుపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివసేన పార్టీకి నాయకత్వం వహించేందుకు ఏక్‌నాథ్ షిండే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. బాలా థాక్రే తర్వాత శివసేనలో ఏక్‌నాథ్ షిండే సీనియర్ లీడర్‌గా ఉన్నారు.

    ఎన్సీపీ, కాంగ్రెస్‌తో శివసేన పొత్తును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిద్ధాంతాలను పక్కనబెట్టి.. పదవుల కోసం ఉద్ధవ్ థాక్రే పాకులాడుతున్నారని.. విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉద్ధవ్ థాక్రే నాయత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాగా, ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే వైపు దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. ఉద్ధవ్ థాక్రే వైపు 20 కంటే తక్కువ మందే ఉన్నట్లు తెలుస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Maharashtra, Mumbai, Shiv Sena, Uddhav Thackeray

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు