MAHARASHTRA POLITICAL CRISIS EKNATH SHINDE TO BE CM SAYS BJPS FADNAVIS OATH AT 7 30 PM SK
CM Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన ట్విస్ట్.. సీఎంగా ఏక్నాథ్ షిండే.. కాసేపట్లో ప్రమాణ స్వీకారం
ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్
Eknath Shinde:
ఉద్ధవ్ థాక్రే రాజీనామా తర్వాత.. బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని అందరూ భావించారు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉంటారని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా.. ఏక్నాథ్ షిండేను సీఎం చేసింది బీజేపీ.
మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) మరో సంచలన మలుపు తీసుకున్నాయి. శివసేన (Shiv sena) రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే (Eknath Shinde).. మహారాష్ట్ర తదుపరి సీఎంగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇవాళే ప్రమాణస్వీకారం జరగనుంది. రాత్రి 07.30 గంటలకు రాజ్భవన్లో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏక్నాథ్ షిండే కాసేపటి క్రితం.. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఇంటికి వెళ్లి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సీఎంగా మీరే ఉండాలని దేవేంద్ర ఫడ్నవీస్.. ఏక్నాథ్ షిండే సూచించారు. అనంతరం ఇద్దరూ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేస్తారని స్వయంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
"Eknath Shinde to be the Maharashtra Chief Minister, oath ceremony to be held at 7.30pm today," BJP leader Devendra Fadnavis announces in a joint press conference with Shinde pic.twitter.com/PiXv1I5nkU
ఏక్నాథ్ షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. శివసేనతో పాటు బీజేపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. తాను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండబోమనని ఆయన స్పష్టం చేశారు. మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం వల్ల పలు అభివృద్ధి పనులు ఆలస్యమయ్యాయని..వాటిని శివసేన-బీజేపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు. వారి హయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఇద్దరు మంత్రులు మనీలాండరింగ్ కేసులో ఉన్నారని.. అవీనితి ఎక్కువగా జరిగిందని మండిపడ్డారు దేవేంద్ర ఫడ్నవీస్. ప్రజాతీర్పును అవమానిస్తూ.. కాంగ్రెస్, ఎన్సీపీతో ఉద్ధవ్ థాక్రే చేతులు కలిపారని దుయ్యబట్టారు. అధికారం కోసం హిందూత్వ సిద్ధాంతాన్ని కూడా పక్కనబెట్టారని విరుచుకుపడ్డారు. శివసేన, బీజేపీ కలిసి.. మహారాష్ట్రను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
Shiv Sena formed an alliance with those who are against Hindutva & Savarkar. Shiv Sena insulted the mandate of the people: BJP leader Devendra Fadnavis pic.twitter.com/Mg6LJFTqsb
మహారాష్ట్ర అభివృద్ధితో పాటు బాలా సాహెబ్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని ఏక్నాథ్ షిండే అన్నారు. తన వెంట 50 మంది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. అందులో 40 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీకి 120 సీట్లు ఉన్నప్పటికీ.. తనకు సీఎం పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ఏక్నాథ్ షిండే. అసలైన శివసైనికుడిని సీఎం చేసిందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
BJP has 120 MLAs but despite that Devendra Fadnavis didn't take the post of CM. I express my gratitude to him along with PM Modi, Amit Shah & other BJP leaders that they showed generosity & made Balasaheb's Sainik (party-worker) the CM of the state: Eknath Shinde pic.twitter.com/OKUn19L33x
ఉద్ధవ్ థాక్రే రాజీనామా తర్వాత.. బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని అందరూ భావించారు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉంటారని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా.. ఏక్నాథ్ షిండేను సీఎం చేసింది బీజేపీ.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.