• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MAHARASHTRA ON SUNDAY REPORTED THAT 63294 NEW COVID19 CASES WERE RECORDED IN THE STATE IN THE LAST 24 HOURS SSR

Maharashtra: మహారాష్ట్రలో 24 గంటల్లో 63,294 కరోనా కేసులు.. లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం అడుగులు..?

Maharashtra: మహారాష్ట్రలో 24 గంటల్లో 63,294 కరోనా కేసులు.. లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం అడుగులు..?

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా గత 24 గంటల్లో 349 మంది మరణించినట్లు పేర్కొంది. దీంతో.. మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,07,245కి చేరింది. మరణాల సంఖ్య 57,987కి చేరుకుంది. మహారాష్ట్రలో ప్రస్తుతముున్న యాక్టివ్ కేసుల సంఖ్య 5,65,587. మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైని...

  • Share this:
    ముంబై: మహారాష్ట్రలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆ రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారత్‌లో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో దాదాపు 50 శాతానికి పైగా కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతుండటం గమనార్హం. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 63,294 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కారణంగా గత 24 గంటల్లో 349 మంది మరణించినట్లు పేర్కొంది. దీంతో.. మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,07,245కి చేరింది. మరణాల సంఖ్య 57,987కి చేరుకుంది. మహారాష్ట్రలో ప్రస్తుతముున్న యాక్టివ్ కేసుల సంఖ్య 5,65,587. మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైని కరోనా కలవరపెడుతోంది. ముంబైలో గడచిన 24 గంటల్లో కొత్తగా 9989 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 58 మంది కరోనా కారణంగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ముంబై నగరంలోనే ప్రస్తుతం 92,464 యాక్టివ్ కేసులున్నాయి. పుణె జిల్లాలో ముంబైకి మించి కరోనా కేసులు నమోదవుతుండటం గమనార్హం. పుణెలో గడచిన 24 గంటల్లో 12,377 కరోనా పాజిటివ్ కేసులు, 87 కరోనా మరణాలు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక.. మహారాష్ట్రలోని మరో జిల్లా నాగ్‌పూర్‌ను కూడా కరోనా బెంబేలెత్తిస్తోంది. నాగ్‌పూర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో 7,201 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 63 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కలవరపెడుతున్నప్పటికీ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కాస్తంత ఊరట కలిగిస్తోంది.

    మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 34,008 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో ముంబైలో 8554, నాగ్‌పూర్ జిల్లాలో 3,240 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక.. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడి చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో, అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మెజార్టీ మంత్రులు, అధికారులు, కోవిడ్19 టాస్క్‌ఫోర్స్ అధికారులు కూడా లాక్‌డౌన్ విధిస్తేనే మేలనే అభిప్రాయాన్ని సీఎం ఎదుట వ్యక్తం చేసినట్లు తెలిసింది. మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే కూడా లాక్‌డౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌పై స్పష్టమైన నిర్ణయాన్ని ఏప్రిల్ 14 తర్వాత ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఒకవేళ లాక్‌డౌన్ విధించాల్సి వస్తే ఆర్థికంగా ఎంతవరకూ తట్టుకోగలమనే విషయంపై సీఎంతో జరిగిన సమీక్షలో చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులకు బ్రేక్ వేయాలంటే లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉందని సీఎంతో సమావేశంలో కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యులు అభిప్రాయపడినట్లు  మంత్రి పేర్కొన్నారు.

    మహారాష్ట్రలో కనీసం 2 వారాల పాటు లాక్‌డౌన్ విధించాలని సీఎంకు మంత్రులు, అధికారులు సూచించారు. కరోనా కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో మూడు వారాల పాటు లాక్‌డౌన్ విధించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో మెజార్టీ మంత్రులు అభిప్రాయపడ్డారు. సోమవారం మరోమారు సమావేశమవ్వనున్నట్లు మంత్రి అస్లాం షేక్ తెలిపారు. మహారాష్ట్రలో మాత్రమే కరోనా కేసులు ఎందుకింత విపరీతంగా పెరుగుతున్నాయో స్టడీ చేయమని కోవిడ్19 టాస్క్‌ఫోర్స్‌కు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.

    ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల కంటే మహారాష్ట్రలోనే ఎందుకింతగా కరోనా కేసులు పెరుగుతున్నాయో అధ్యయనం చేయమని సూచించినట్లు మంత్రి అస్లాం తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో చాలామంది మంత్రులు, ముఖ్య నేతలు భారీ జన సందోహం మధ్య ప్రచారం చేస్తున్నారని.. అయినప్పటికీ అలాంటి చోట్ల కరోనా కేసుల్లో ఎలాంటి పెరుగుదల లేదని మంత్రి అస్లాం షేక్ చెప్పారు.
    Published by:Sambasiva Reddy
    First published: