Home /News /national /

MAHARASHTRA MUMBAI RAINS MONSOON WEATHER UPDATE MUMBAI WATERLOGGED IMD ALERT FOR HEAVY RAIN CM SHINDE REVIEW MKS

Heavy Rains : నీట మునిగిన మహా నగరం.. రాబోయే గంటల్లో అతి భారీ వర్షాలు : IMD వార్నింగ్

ముంబై సిటీని ఆవహించిన కారుమబ్బులు

ముంబై సిటీని ఆవహించిన కారుమబ్బులు

ముంబై సిటీ సహా పరిసర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ అయింది..

ఇంకా చదవండి ...
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం నీట మునిగింది. గడిచిన కొద్ది గంటలుగా మహారాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ముంబై సహా ఆరు జిల్లాల్లో భారీ వర్షపాతం కారణంగా జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముంబై సిటీలోని లోటత్తు ప్రాంతాలు వరదలో మునిగాయి. ఎటు చూసినా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఇది చాలదన్నట్లు రాబోయే కొద్ది గంటల్లో మరిత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. కొత్త సీఎం ఏక్ నాథ్ షిండే పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. (Maharashtra Mumbai rains)వివరాలివే..

ముంబై సిటీ సహా పరిసర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. మంగళవారం ఉదయానికే నగరంలో సగటున 95.81 మిమీ వర్షపాతం నమోదైంది, అదే సమయంలో తూర్పు, పశ్చిమ ముంబై శివారు ప్రాంతాల్లో వరుసగా 115.09 మిమీ, 116.73 మిమీ వర్షపాతం నమోదైంది.


CM KCR : కేసీఆర్ వ్యూహం మారిందా? BRSకు బైబై.. TRSపైనే ఫోకస్ -20 నుంచి జిల్లాల పర్యటన!


ముంబై సిటీతోపాటు మహారాష్ట్రలోని తీరప్రాంత కొంకణ్‌లో రాబోయే ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది. భారీవర్షాల వల్ల మహారాష్ట్రలోని రెండు జిల్లాల్లో భారీ వరదలు వెల్లువెత్తే అవకాశాలుండటంతో తీరప్రాంత కొంకణ్‌లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) రెండు బృందాలను మోహరించారు. థానే, పుణె, రాయగడ, రత్నగిరి, సింధుదుర్గ్, పాల్ఘర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


Vivo | ED raids : వివో మొబైల్‌కు షాక్.. చైనీస్ కంపెనీపై ఈడీ దాడులు.. 44చోట్ల సోదాలు..


ముంబైలో అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇవాళ ఉద‌యం వీధుల్లో నీరు నిలిచిపోయి వాహ‌న‌దారులు తెగ ఇబ్బందిప‌డ్డారు. సియాన్‌, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని రూట్ల‌లో రైళ్లు, బ‌స్సు స‌ర్వీసుల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న రైల్వే ట్రాక్‌ల‌పై వ‌ర‌ద నీరు చేరుతోంది.

Maharashtra : షాకిచ్చిన పవార్ -కూలనున్న షిండే సర్కార్.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు!


ముంబైతోపాటు మహారాష్ట్ర అంతటా కురుస్తోన్న భారీ వర్షాలు, తద్వారా తలెత్తిన పరిస్థితులను ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రివ్యూ చేశారు. ముంబైతో పాటు స‌మీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్‌ ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఎక్కడికక్కడే అప్రమత్తంగా వ్యవహరించాలని, అలసత్వానికి తావు ఇవ్వకుండా పని చేయాలని సీఎం ఆదేశించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Heavy Rains, IMD, Maharashtra, Mumbai, Weather report

తదుపరి వార్తలు