హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

nawab malik:  నా ఇంటిపై రెక్కీ నిర్వహించారు..  నాపై తప్పుడు కేసులు పెట్టేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నాయి..

nawab malik:  నా ఇంటిపై రెక్కీ నిర్వహించారు..  నాపై తప్పుడు కేసులు పెట్టేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నాయి..

న‌వాబ్ మాలిక్‌ (ఫొటో క్రెడిట్ - పీటీఐ)

న‌వాబ్ మాలిక్‌ (ఫొటో క్రెడిట్ - పీటీఐ)

ఆర్యన్​ ఖాన్​ అరెస్టవడం (Aryan khan arrest) దగ్గరినుంచి నవాబ్​ మీడియాలో పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే మళ్లీ మీడియా ముందుకొచ్చిన నవాబ్​ మలిక్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తన ఇల్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారని శనివారం ముంబైలో ఆరోపించారు.

ఇంకా చదవండి ...

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ (Nawab malik). దేశంలో రాజకీయ నాయకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్సీపీ (NCP) పార్టీకి చెందిన నవాబ్​ మలిక్​ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ముంబైలోని క్రూయిజ్​ షిప్​లో డ్రగ్స్​ దొరకడం (drugs case), అనంతరం బాలీవుడ్​ నటుడు షారుక్​ ఖాన్​ కుమారుడు ఆర్యన్​ ఖాన్​ అరెస్టవడం (Aryan khan arrest) దగ్గరినుంచి నవాబ్​ మీడియాలో పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే మళ్లీ మీడియా ముందుకొచ్చిన నవాబ్​ మలిక్ (nawab malik)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తన ఇల్లు, కుటుంబ సభ్యులపై నిఘా (spying on his house and family members) పెట్టారని శనివారం ముంబైలో ఆరోపించారు.

పాఠశాలల వద్ద కెమెరాలతో ఫొటోలు..

నవాబ్‌ మాలిక్‌ స్పందిస్తూ..  ‘ గత వారం నేను దుబాయ్‌ (Dubai)లో ఉన్నపుడు ముంబైలో నా ఇంటి వద్ద ఇద్దరు రెక్కీనిర్వహించారు. కుటుంబ సభ్యులపై నిఘా (spy) పెట్టారు. ఇల్లు, ఆఫీస్, మనవళ్ల పాఠశాలల వద్ద కెమెరాలతో ఫొటోలు తీశారు. మా సమాచారం సేకరించారు. నా దగ్గర సాక్ష్యాలున్నాయి (evidence). తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు చేసిన వాట్సాప్‌ చాట్స్‌ (WhatsApp chats) నా వద్ద ఉన్నాయి. నాపై కేసులు (cases) పెడితే ఊరుకోను. ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Home minister Amit shah), ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలేలకు ఫిర్యాదుచేస్తా’ అని హెచ్చరించారు.

సమీర్ వాంఖడేపై ప‌లు ఆరోప‌ణ‌లు..

రాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్ ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్ వాం ఖడే (Sameer Wankhede)పై ఇటీవల ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. అత‌ను నిజాయితీ ప‌రుడైతే రూ.లక్ష విలువైన ట్రౌజర్, రూ.70 వేల విలువైన చొక్కా , 25 నుం చి 30 లక్షల విలువైన చేతి గడియారాలు ఎలా ధ‌రిస్తాడ‌ని ఆరోపించారు. అక్రమం గా కొం దరిని కేసుల్లో ఇరికిం చి, వాంఖ‌డే కోట్లకు పడగలెత్తాడ‌ని అన్నారు. ఈ తరహా పనులు చేయడానికి ఆయనకు ప్రైవేటుగా కొం దరు వ్యక్తులున్నార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు.

డ్ర‌గ్ కేసు వ్య‌వ‌హారంలో రాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్ అండ‌ర్ వ‌ర‌ల్డ్‌ (Under World)తో సంబంధాలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫండ్న‌వీస్ (Devendra fadNavis) సైతం ఇటీవల ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై ఫడణవీస్‌ మహారాష్ట్ర (Maharashtra) ముఖ్య మంత్రిగా పనిచేశారు. హోం మం త్రిత్వ శాఖ కూడా ఆయన వద్దే ఉం ది. దీనిపై ఆయన అప్పు డే ఎందుకు విచారణ జరపలేదు’ అని మాలిక్ ఎదురుదాడికి దిగారు. త‌న‌ను వేలెత్తి చూపే హ‌క్కు ఎవ‌ర‌కీ లేద‌ని ఆయ‌న అన్నారు. దీపావళి తర్వాత మాలిక్‌కు అండ‌ర్ వ‌రల్డ్‌తో ఉన్న సంబంధాలు బ‌హిర్గ‌తం చేస్తామ‌ని ఫండ్న‌వీస్ అన్నారు.

మహారాష్ట్రలో రెండేళ్లు పూర్తి..

కాగా, మహావికాస్​ ఆఘాడీ (MVA) ప్రభుత్వం మహారాష్ట్రలో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందరర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘MVA మహారాష్ట్రలో తన 2 సంవత్సరాల పాలనను పూర్తి చేసింది. 2 నెలల్లో రూ. 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేయడమే మా మొదటి పని.” అన్నారు.

First published:

Tags: Aryan khan drugs case, Maharastra, NCP

ఉత్తమ కథలు