హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Maharastra : నేను రేప్ చేయలేదు..రిలేషన్ షిప్ లో ఉన్నా..మంత్రి సంచలన వ్యాఖ్యలు

Maharastra : నేను రేప్ చేయలేదు..రిలేషన్ షిప్ లో ఉన్నా..మంత్రి సంచలన వ్యాఖ్యలు

maharashtra minister dhananjay munde

maharashtra minister dhananjay munde

Maharastra : మహారాష్ట్ర సీఎం కేబినేట్ లో ప్రకంపనలు మొదలయ్యాయ్ . మహారాష్ట్ర మంత్రి ధనుంజయ ముండే తనను రేప్ చేశాడని సింగర్ రేణు శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు.

  మహారాష్ట్ర సీఎం కేబినేట్ లో ప్రకంపనలు మొదలయ్యాయ్ . మహారాష్ట్ర మంత్రి ధనుంజయ ముండే తనను రేప్ చేశాడని సింగర్ రేణు శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహారాష్ట్ర పోలీస్ కమీషనర్ పరంభీర్ సింగ్ కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. వెంటనే మంత్రి ధనుంజయ ముండేపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. అంతేకాకుండా తన ప్రాణానికి ముప్పు ఉందని.. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో సహాయం చేయాలని ఆమె కోరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే, తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి ధనంజయ స్పందించారు. ఆ మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తుందని.. వాస్తవానికి ఆమె సోదరి, తను రిలేషన్‌లో ఉన్నామని తెలిపారు. అంతేకాక అక్కాచెల్లెల్లిద్దరు తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ.. డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వీరిద్దరి మీద తాను గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానన్నారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ సోదరితో తనకు 2003 నుంచి సంబంధం ఉందని.. తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ధనుంజయ్‌ ముండే తెలిపారు. అంతేకాక ఈ మధ్య కాలంలోనే తమ సంబంధం గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశానని. వారు కూడా అంగీకరించారని.. అంతా బాగుందనుకున్న సమయంలో తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు.

  ఇక ధనంజయ్‌ ప్రకటన తర్వాత మహారాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేటర్‌ రాశారు. రెండు రోజుల క్రితం సదరు మహిళ ధనుంజయ్‌ ముండే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఒడిశాలోని అంధేరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె తరపు లాయర్‌ మాట్లాడుతూ.. ‘బాధితురాలికి 1997 నుంచి ధనుంజయ్‌ ముండేతో పరిచయం ఉంది. తొలుత బాలీవుడ్‌లో సింగర్‌గా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆమెతో క్రమంగా పరిచయం పెంచుకున్నాడు’ అని తెలిపారు.

  రేణు శర్మ చేసిన ట్వీట్ తో ఉద్దవ్ థాక్రే కేబినేట్ లో ప్రకంపనలు మొదలయ్యాయ్. రాష్ట్రంలో మహిళలను కాపాడాల్సిన మంత్రులే ఇలా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఫైరవుతున్నాయ్. అతన్ని క్యాబినేట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర మహిళా విభాగం డిమాండ్ చేస్తోంది. మహారాష్ట్ర సోషల్ అండ్ జస్టిస్ మినిస్టర్ గా ధనంజయ్ ముండే పనిచేస్తున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Bjp, Blackmail, Maharashtra, RAPE, Shiv Sena

  ఉత్తమ కథలు