హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

గర్భా వేడుకల్లో మరో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువకుడు.. కొడుకు మృతిని తట్టుకోలేక..

గర్భా వేడుకల్లో మరో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువకుడు.. కొడుకు మృతిని తట్టుకోలేక..

చనిపోయిన యువకుడు, అతడి తండ్రి..

చనిపోయిన యువకుడు, అతడి తండ్రి..

Viral news: మహారాష్ట్రలోని పాల్ఘర్ లో గర్భా ఈవెంట్ లో ఒక యువకుడు కుప్పకూలిపోయిన ఘటనలో చనిపోయాడు. ఇదిలా ఉండగా అతని ఇంట్లో మరో విషాదకర సంఘటన సంభవించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

మహారాష్ట్రలోని (Maharashtra)  పాల్ఘర్ జిల్లాలో గర్భా ఈవెంట్ కొనసాగుతుంది. అప్పటి వరకు యువకులంతా జోష్ గా డ్యాన్స్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్న వారంతా అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తలించారు. అతడిని టెస్ట్ చేసిన వైద్యులు చనిపోయినట్లు తెలిపారు. కాగా, మనీష్ నారప్జీ సోనిగ్రా అనే వ్యక్తి శని, ఆదివారాల్లో రాత్రి విరార్‌లోని గ్లోబల్ సిటీ కాంప్లెక్స్‌లో జరిగిన గర్బా ఈవెంట్‌లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు కుప్పకూలిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు.

అతని తండ్రి నారాప్జీ సోనిగ్రా (66) వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని టెస్ట్ చేసిన డాక్టర్లు చనిపోయినట్లు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడుకు మరణవార్త విని ఆ వ్యక్తి తండ్రి కూడా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తూ మృతిగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వరుస సంఘటనలతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇదిలా ఉండగా గుజరాత్‌(Gujarat)లో పండుగ పూట విషాద సంఘటన అందర్ని తీవ్రంగా బాధించింది.

దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా(Dandiya)ఓ కాలనీలో వాసులంతా దాండియా ఆడుతున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు దాండియా ఆడుతూనే కుప్పకోలిపోయాడు. వెంటనే ఆసుపత్రి (Hospital)కి తరలించేలోపే మృతి చెందాడు. పట్టుమని పాతికేళ్ల వయసు లేని ఆ యువకుడు ఎందుకు చనిపోయాడో తెలిసి అందరూ షాక్ అయ్యారు. కాలనీలో దాండియా దృశ్యాల్ని సెల్‌ఫోన్‌(Cell phone)లో చిత్రీకరిస్తున్న సమయంలో ఈ లైవ్ డెత్ వీడియో(Live Death Video)రికార్డైంది. ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్(Viral)అవుతోంది.

పండుగ వేడుకల్లో విషాదం ..

దేశ వ్యాప్తంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఈపండుగను అందరూ 9రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటారు. గుజరాత్‌లో కూడా అంతే గొప్ప శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆనంద్‌లోని తారాపూర్‌ సమీపంలోని యారాపూర్‌లోని ఆటి శివశక్తి సొసైటీలో గర్భా సందర్భంగా స్థానికులు దాండియా ఆడారు. కాలనీ వాసులంతా ఒక్క దగ్గరకు చేరి అమ్మవారికి భక్తితో పాటలకు అనుగూణంగా దాండియాను పోలిన నృత్యం చేస్తున్నారు.

అదే సమయంలో ఓ బాలుడు గర్భా ఆడుతూ కిందపడిపోయాడు. చిన్న, పెద్ద, మహిళలు, కుర్రాళ్లంతా కలిసి పాలుపంచుకున్న ఈవేడుకను మరో యువకుడు వీడియో తీస్తుండగా బాలుడు డ్యాన్స్ చేస్తు కిందపడిపోయిన వీడియో రికార్డైంది. బాలుడు కిందపడిపోవడంతో అందరూ డ్యాన్స్‌ ఆపేసి పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Maharashtra, VIRAL NEWS

ఉత్తమ కథలు