హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rising India Summit: శివసేన చీలిక ఆ పార్టీ విశ్వాసపాత్రులైన ఓటర్ల నిర్ణయం.. బీజేపీ ప్రమేయం లేదన్న షా

Rising India Summit: శివసేన చీలిక ఆ పార్టీ విశ్వాసపాత్రులైన ఓటర్ల నిర్ణయం.. బీజేపీ ప్రమేయం లేదన్న షా

రైజింగ్ ఇండియా సమ్మిట్ లో అమిత్ షా

రైజింగ్ ఇండియా సమ్మిట్ లో అమిత్ షా

న్యూఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌లో జరుగుతున్న రైజింగ్ ఇండియా సమ్మిట్-2023లో బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆరోపణలకు ఆయన సమాధానమిచ్చారు. అదే విధంగా మహారాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Rising India Summit: న్యూఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌లో జరుగుతున్న రైజింగ్ ఇండియా సమ్మిట్-2023(Rising india summit)లో బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amith shah) పాల్గొన్నారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆరోపణలకు ఆయన సమాధానమిచ్చారు. అదే విధంగా మహారాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. శివసేన(Shiv sena0 పార్టీ విడిపోయి భారతీయ జనతా పార్టీ (BJP)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఠాక్రేలకు సానుభూతి, మద్దతు పెరిగిందనే విశ్లేషణలను అమిత్‌ షా ఖండించారు. అసలు సేన తమవెంటే ఉందని చెప్పారు. షా ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం.

* అసలు సేన మా వెంటే ఉంది

మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి షా మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలో బీజేపీ , శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ , నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఆఫర్ చేశాయి. అందుకు ఉద్ధవ్‌ ఠాక్రే అంగీకరించారు. కానీ వారి నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్లడం ప్రారంభించినప్పుడు, వారి సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు తెరపైకి వచ్చాయి. శివసేన ఏళ్ల తరబడి హిందుత్వ రాజకీయాలను ఆచరిస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీ రాజకీయాలు వేరు. ఎంతోకాలంగా విధేయులుగా ఉన్న సేన ఓటర్లు ప్రజా ప్రతినిధులను ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో వారు ఠాక్రే సేన నుంచి బయటకు రావాల్సి వచ్చింది. సేన నేతలు పార్టీని వీడటానికి బీజేపీ కారణం కాదు. ప్రజలు సేన, బీజేపీ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అసలు సేన మా వెంటే ఉంది. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఎన్నికల్లో కలిసి పోరాడతాం.’ అని చెప్పారు.

Rising India Summit: ‘ఏజెన్సీల దుర్వినియోగం వారికి తెలిసిన విద్య .. విచారణలో మోదీ పేరు చెప్పమన్నారు:’ అమిత్ షా

* బీజేపీలో శివసేన విలీనం అవుతుందా?

మహారాష్ట్రలో బీజేపీ ఒంటరిగా పోటీచేసి ఉంటే మెజారిటీ సాధించి ఉండేదని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు షా బదులిస్తూ.. ఆ నమ్మకం ఉందని, కానీ శివసేన కొన్నేళ్లుగా బీజేపీతో కలిసి ఉందని, అందుకే వారిని విశ్వసించామని, కలిసి పోటీ చేశామని తెలిపారు.

ఏక్‌నాథ్ షిండే సేనను బీజేపీలో విలీనం చేస్తారా? అనే ప్రశ్నకు.. విలీనం చేయాలనే ప్రతిపాదనలు, ఆలోచనలు లేవని షా చెప్పారు. షిండే వెంటనే నిజమైన శివసేన ఉందని, ఎన్నికల సంఘం అందుకు అంగీకరించి వారికి విల్లు, బాణం గుర్తును మంజూరు చేసిందని, బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో ఎమ్మెల్యేల మధ్య విభేదాల మధ్య గవర్నర్ బలపరీక్షకు పిలవకూడదన్న ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ అబ్జర్వేషన్‌పై షా తన అభిప్రాయం పంచుకున్నారు. అది సుప్రీం కోర్టు తీర్పు కాదు, వారి ప్రతిస్పందన అలా ఉంది, దానికి సేన లాయర్లు స్పందించారని భావిస్తున్నామన్నారు. కోర్టు తీర్పు వెలువడక ముందు వ్యాఖ్యలు చేయకూడదని, తీర్పు వచ్చిన తర్వాత తప్పకుండా అనుసరిస్తామని షా చెప్పారు.

First published:

Tags: Amit Shah, Bjp, Shiv Sena, Uddhav Thackeray

ఉత్తమ కథలు