HOME »NEWS »NATIONAL »maharashtra karni sena chief ajay sengar controversial comments about tandav amazon web series hsn

Tandav Web Series: వాళ్ల నాలుకలు కోస్తే కోటి రూపాయలు ఇస్తా.. తాండవ్ వెబ్ సీరీస్ పై కర్ణిసేన చీఫ్ ఆగ్రహం

Tandav Web Series: వాళ్ల నాలుకలు కోస్తే కోటి రూపాయలు ఇస్తా.. తాండవ్ వెబ్ సీరీస్ పై కర్ణిసేన చీఫ్ ఆగ్రహం
‘తాండవ్’ వెబ్ సిరీస్‌ (Twitter/Photo)

సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో తాండవ్ వెబ్ సీరీస్ చిత్రీకరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సీరీస్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. దీంట్లో హిందూ దేవుళ్లను అవమానించేలా చిత్రీకరణ జరిగిందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

  • Share this:
    హిందువుల ఆరాధ్య దైవమైన శివుడిని అపహాస్యం చేసేలా తాండవ్ అనే వెబ్ సీరీస్ లో చిత్రీకరణ చేశారంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయమై మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లోని హిందూ సంఘాల నేతలు కూడా నిరసనలకు దిగుతున్నారు. తాండవ్ సినిమా సభ్యులు క్షమాపణ చెప్పాలనీ, వెంటనే అసభ్యకరమైన సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎంతకూ తాండవ్ టీమ్ స్పందించకపోవడంతో పలువురు నేతలు తీవ్ర పదజాలంతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హిందూ దేవుళ్లను హేళన చేస్తూ అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరించిన వారి నాలుక కోసిన వారికి ఏకంగా కోటి రూపాయల రివార్డును ఇస్తామంటూ ప్రకటించి కలకలం రేపారు. వివరాల్లోకి వెళ్తే..

    తాండవ్ సినిమా వివాదంపై మహారాష్ట్ర కర్ణిసేన చీఫ్ అజయ్ సేంగార్ సంచలన కామెంట్స్ చేశారు. ’వెబ్ సీరీస్ లలో హిందూ దేవుళ్లను, దేవతలను అవహేళన చేసిన వారి నాలుకను తెగ్గోసిన వారికి కోటి రూపాయల రివార్డును ఇస్తాం‘ అని అజయ్ సేంగార్ సంచలన ప్రకటన చేశారు. తాండవ్ చిత్ర బృందం ప్రజలందరికీ క్షమాపణ చెప్పినా, దాన్ని ఏమాత్రం అంగీకరించబోమని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ దేవుళ్లను అవమానిస్తూ సినిమాలు తీసి, ప్రచారం పెంచుకుని ఆ తర్వాత క్షమాపణ చెప్పడం రివాజుగా మారిందని విమర్శించారు. ఆయన చేసిన ప్రకటన కాస్తా తీవ్ర కలకలం రేపుతోంది.



    కాగా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో తాండవ్ వెబ్ సీరీస్ చిత్రీకరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సీరీస్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. దీంట్లో హిందువుల ఆరాధ్య దైవం శివుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారనీ అవమానించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్ర బృందం క్షమాపణ చెప్పాలని, అమెజాన్ ప్రైమ్ లోంచి ఈ వెబ్ సీరీస్ ను డిలీట్ చేయాలని డిమాండ్లు వచ్చాయి. హిందువులంతా అమెజాన్ ప్రైమ్ ను, అమెజాన్ ను బహిష్కరించాలని కూడా పిలపునిచ్చారు. ఇప్పటికే ఈ వెబ్ సీరీస్ పై లక్నోలోని హర్తాగంజ్ కొత్వాలీలో కేసు నమోదయింది. ఈ ఫిల్మ్ మేకర్ అలీ అబ్బాస్ జాఫర్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహ్రా, రచయిత గౌరవ్ సోలాన్కీ, ఇతర నటీనటులపై కేసులు నమోదయ్యాయి.
    Published by:Hasaan Kandula
    First published:January 23, 2021, 21:20 IST