సుప్రీంకోర్టుకు చేరిన మహారాష్ట్ర పవర్ పంచాయితీ

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయంపై మహారాష్ట్ర వికాస అఘాడి (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్) కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

news18-telugu
Updated: November 23, 2019, 10:57 PM IST
సుప్రీంకోర్టుకు చేరిన మహారాష్ట్ర పవర్ పంచాయితీ
శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్
  • Share this:
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా పార్టీల పవర్ గేమ్ మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో బీజేపీ అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ వర్గం సపోర్ట్‌తో.. దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాత్రికి రాత్రే మారిన రాజకీయంతో దేశ ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అటు మహారాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఎవరు ఏ వర్గంలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి..!

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయంపై మహారాష్ట్ర వికాస అఘాడి (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్) కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 3 పార్టీలకు కలిపి 144 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. తమ కూటమికి కాకుండా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తూ గవర్నర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని..24 గంటల్లో బలపరీక్ష నిర్వహించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ కేసును
ఆదివారం ఉదయం 11.30కి విచారించనుంది సుప్రీంకోర్టు. శివసేన తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలను వినిపించనున్నారు.

మరోవైపు ఎన్సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీకి మద్దతిచ్చిన అజిత్ పవార్ వర్గం క్రమంగా బలహీనపడుతున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో అజిత్ పవార్ వెంట 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐతే వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు మధ్యాహ్నం శరద్ పవార్ చెంతన చేరారు. ఎన్సీపీ ఎమ్మెల్యే సమావేశానికి దిలీప్ బంకార్, సునీల్ షెల్కె, సునీల్ భాసుర, సంజయ్ బన్సోడె హాజరయ్యారు. ఇక అజిత్ వర్గంలో మిగిలిన ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు.

First published: November 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు