Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    వలస కూలీలకు సోనూసూద్ సాయం.. ప్రశంసించిన గవర్నర్..

    ప్రజారవాణ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో వలస కార్మికులంతా వేలాది కిలోమీటర్ల దూరాన్ని కాలినడకనే సొంత ప్రాంతాలకు నడిచి వెళుతున్నారు. దీంతో వందలాదిమంది వలస కార్మికుల్ని స్వస్థలాలకు పంపేందుకు సోనూసూద్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

    news18-telugu
    Updated: May 31, 2020, 5:15 PM IST
    వలస కూలీలకు సోనూసూద్ సాయం.. ప్రశంసించిన గవర్నర్..
    సోనూ సూద్ (Twitter/Sonu Sood)
    • Share this:
    కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వలస కార్మికుల బాధలను చూసి చలించిపోని వారంటూ లేరంటే అతిశయోక్తి కాదు. అయితే కేవలం వలస కార్మికుల మీద జాలి చూపేందుకు పరిమితం కాకుండా నేనున్నాంటూ సినీ నటుడు సోనూసూద్ వలస కార్మికులను అక్కున చేర్చుకున్నాడు. ప్రజారవాణ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో వలస కార్మికులంతా వేలాది కిలోమీటర్ల దూరాన్ని కాలినడకనే సొంత ప్రాంతాలకు నడిచి వెళుతున్నారు. దీంతో వందలాదిమంది వలస కార్మికుల్ని స్వస్థలాలకు పంపేందుకు సోనూసూద్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. లాక్‌డౌన్ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన మహిళలను తమ సొంత రాష్ట్రం ఒడిశాకు పంపేందుకు సోనూసూద్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

    దీంతో సోనూసూద్ వలస కార్మికులకు చేస్తున్న సేవల నేపథ్యంలో ముంబయిలోని రాజ్ భవన్‌కు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కౌశ్యారీ ఆహ్వానించారు. వలస కార్మికులు క్షేమంగా ఇల్లు చేరేందుకు ఏర్పాట్లు చేసినందుకు గవర్నర్ సోనూసూద్‌ను అభినందించారు. ఇలాంటి మంచి పనులు చేసేందుకు ప్రభుత్వం ఎప్పడూ ముందుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం సోనూసూద్‌ను మెచ్చుకున్నారు.
    Published by: Narsimha Badhini
    First published: May 31, 2020, 5:15 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading