Home /News /national /

MAHARASHTRA GOVERNMENT ON SATURDAY ANNOUNCED A LOAN WAIVER OF UPTO RS TWO LAKH FOR FARMERS MK

రైతులకు శుభవార్త...రూ.2లక్షల లోపు రుణాలు మాఫీ...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు.

    మహారాష్ట్రలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ఈ రుణాలకు చెల్లించాల్సిన డబ్బు రైతులకు మరొక విధంగా సహాయ పడుతుందని ఉద్ధవ్ అన్నారు. రైతు రుణాలను నేరుగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమం మార్చి నుంచి అమలు చేస్తామని సీఎం ఉద్ధవ్‌ థాక్రే తెలిపారు. 'మహాత్మా జ్యోతిరావు ఫూలే లోన్ మాఫీ పథకం' అని పిలువబడే ఈ పథకం కింద 2019, సెప్టెంబర్ 30 వరకు తీసుకున్న వ్యయసాయ రుణాలు రద్దు కానున్నాయి.

    రైతు రుణ మాఫీ అమలు కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కార్యాలయాలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రైతులు ప్రతి చిన్నపనికి ముంబై రావల్సిన అవసరం లేకుండా ఆ కార్యలయాల్లో ప్రభుత్వం నుంచి తమకు అందాల్సిన అన్నిపధకాలు పూర్తిచేసుకోవచ్చని ఆయన వివరించారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Agriculture

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు