Home /News /national /

MAHARASHTRA GOVERNMENT GIVING LOANS TO PRISONERS PILOT PROJECT STARTED IN PUNE JAIL AK

Loans For Prisoners: జైలులోని ఖైదీలకు రుణాలు.. దేశంలోనే తొలిసారిగా.. ఆ రాష్ట్రంలో.. ఎంత ఇస్తారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Prisoners: పూణెలోని ఎరవాడ జైలులో ఉన్న దాదాపు 1,055 మంది ఖైదీలు ఈ పథకాన్ని ప్రారంభంలో ఉపయోగించుకోగలరు. వీరిలో చాలా మంది ఖైదీలు సుదీర్ఘ శిక్ష అనుభవిస్తున్నారు.

    బ్యాంకు కూడా నిందితులకు లేదా జైలులో ఉన్న దోషులకు రుణం ఇవ్వదు. జైలులో(Jail) ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగాలేక ఖైదీల కుటుంబాలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఖైదీ తన కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తిగా ఉంటారు. వాళ్లు జైలుకు వెళ్లడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంటాయి. అలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అటువంటి ఖైదీలు ఇప్పుడు వ్యక్తిగత రుణం తీసుకునే అవకాశం దక్కనుంది. అది కూడా ఎలాంటి హామీదారు లేకుండా, తక్కువ వడ్డీ రేటుతో రుణం(Loan) ఇవ్వనున్నారు. భారత్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.

    జైలులో ఉన్న ఖైదీలకు రుణాలు ఇవ్వాలని మహారాష్ట్ర(Maharashtra) ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం నిర్ణయించింది. పూణెలోని ఎరవాడ జైలులో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నారు. దీని కింద ఖైదీలకు రూ.50,000 వరకు వ్యక్తిగత రుణాలు లభిస్తాయి. మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఈ పథకం కింద ఖైదీలకు 7 శాతం వడ్డీ రేటుతో రుణం ఇస్తుంది. జైలులో చేసిన పనికి ప్రతిఫలంగా వారికి ఈ రుణం అందనుంది. జైల్లో ఉన్న ఖైదీలకు రుణ సదుపాయం కల్పించడం దేశంలోనే తొలిసారిగా జరుగుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

    సహకార బ్యాంకులు ఖైదీల ఆదాయం, రోజువారీ వేతనాలు, శిక్షా కాలం, శిక్ష నుండి సాధ్యమయ్యే ఉపశమనం, వయస్సు మొదలైన వాటి ఆధారంగా రుణాలు ఇస్తాయి. ఈ రుణానికి ఎటువంటి హామీదారు అవసరం లేదు. వ్యక్తిగత పూచీకత్తుపై మాత్రమే రుణం ఇవ్వబడుతుంది.

    అఖిలేష్ యాదవ్‌కు బీజేపీ మరో షాక్.. కమలం వైపు చూస్తున్న ములాయం తమ్ముడు ?

    AFSPA: మాట నిటెట్టుకున్న మోదీ సర్కార్.. సాయుధ దళాల ప్రత్యేక చట్టం పరిధి కుదింపు: Amit Shah

    పూణెలోని ఎరవాడ జైలులో ఉన్న దాదాపు 1,055 మంది ఖైదీలు ఈ పథకాన్ని ప్రారంభంలో ఉపయోగించుకోగలరు. వీరిలో చాలా మంది ఖైదీలు సుదీర్ఘ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఖైదీలలో ఎక్కువ మంది వారి కుటుంబాలను పోషించే వ్యక్తులుగా ఉన్నారు.. జైలుకు వచ్చిన తర్వాత అతని కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ ఖైదీలకు కుటుంబ అవసరాలు, ఇతర పనుల కోసం రుణాలు అందజేస్తారు. ఈ ఖైదీలు కూడా లాయర్ ఫీజు చెల్లించడానికి రుణ మొత్తాన్ని ఉపయోగించుకోగలరు. ఇలా ఖైదీల కోసం వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ఈ ప్రయోగం ఫలిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలోనూ ఇది పథకాన్ని విస్తరించాలనే యోచనలో ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bank loans, Jails

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు