హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Maharashtra Assembly : సీఎం షిండేపై బహిష్కరణ వేటు -అసెంబ్లీ స్పీకర్‌గా రాహల్ నర్వేకర్ గెలుపు

Maharashtra Assembly : సీఎం షిండేపై బహిష్కరణ వేటు -అసెంబ్లీ స్పీకర్‌గా రాహల్ నర్వేకర్ గెలుపు

మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్, సీఎం షిండే

మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్, సీఎం షిండే

షిండే వర్గం అండతో బీజేపీ రాహుల్ నర్వేకర్ ను స్పీకర్ అభ్యర్థిగా నిలపగా, శివసేన కూడా రాజన్ సాల్విని బరిలోకి దింపింది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ఆదివారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే సీఎం ఏక్ నాథ్ షిండేను శివసేన బహిష్కరించింది..

ఇంకా చదవండి ...

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం (Maharashtra Political Crisis) ముగింపు దశకు చేరింది. కొత్త సీఎం ఏక్ నాథ్ షిండే (Eknath shinde) సర్కారు బలనిరూపణకు వీలుగా ఇవాళ (జూన్ 3, ఆదివారం) అసెంబ్లీ స్పీకర్ (Maharashtra Assembly Speaker) ఎన్నిక జరిగింది. ఈ పదవికి షిండే వర్గం అండతో బీజేపీ రాహుల్ నర్వేకర్ (Rahul Narwekar)ను అభ్యర్థిగా నిలపగా, శివసేన కూడా రాజన్ సాల్విని బరిలోకి దింపింది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. రాహుల్ నర్వేకర్ కు అనుకూలంగా 164 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 107 ఓట్లు పడ్డాయి. స్పష్టమైన మెజార్టీ సాధించడంతో స్పీకర్ గా రాహుల్ ఎన్నికైనట్లు ప్రొసీడింగ్స్ నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.

తొలుత డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించి, స్పీకర్ ఎన్నిక ప్రక్రియను మొదలుపెట్టారు. సభకు హాజరైన సభ్యులు నిలబడి ఉండగా, తలలు లెక్కించే విధానంలో స్పీకర్ ఎన్నికను చేపట్టారు. బలాబలాల దృష్ట్యా స్పీకర్ గా రాహుల్ ఎన్నిక లాంఛనంగా మారింది. స్పీకర్ ఎన్నిక వేళ శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే తన వర్గం ఎమ్మెల్యేలతో సభకు హాజరయ్యారు. కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేశారు. బీఎస్పీ సభ్యులు ఇద్దరు ఓటింగ్ లో పాల్గొనకుండా సభలోనే కూర్చొండిపోయారు. కొత్త స్పీకర్ రాహుల్ ను సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ దగ్గరుంచి కుర్చీలో కూర్చోబెట్టారు.

BJP | TRS : సర్కారు కూల్చివేత : కేసీఆర్‌కు బీజేపీ ప్రతిసవాల్ -నీలో తెలంగాణ నెత్తురుంటే..


గవర్నర్ ఆదేశాల మేరకు రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు ఆదివారం ఉదయం ప్రారంభంకాగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెబెల్‌ నేత ఏక్‌నాథ్‌ శంబాజీ షిండేను శివసేన నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేరుతో ఆదివారం ఉదయం ఒక ప్రకటన వెలువడింది. కొత్త సీఎం షిండే రేపు(సోమవారం) బలపరీక్షకు సిద్ధపడగా, ఇవాళ హడావుడిగా పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది. అయితే, ఈ నిర్ణయం షిండేకు వర్తించబోదని, అసలైన శివసేన పార్టీ తమదేనని, ఇప్పటికీ శాసనసభాపక్ష నేతగా షిండేనే కొనసాగుతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

PM Modi | BJP : మోదీ సభ వద్దే పీఎంవో : ఈ దారులు బంద్ -TSRTC, Metro సర్వీసులు ఇలా


కొత్త స్పీకర్ గా ఎన్నికైన రాహుల్‌ సభాధ్యక్షతలో 4వ తేదీన షిండే సర్కారు తన బలాన్ని నిరూపించుకోనుంది. తమకు 175మంది సభ్యుల బలం ఉందని.. సోమవారం జరిగే బలపరీక్ష లాంఛనమేనని సీఎం ఏక్‌నాథ్‌ షిండే స్పష్టం చేశారు. గురువారం రాత్రి ప్రమాణస్వీకారం, తొలి కేబినెట్‌ భేటీ తర్వాత ఆయన అర్ధరాత్రి గోవా వెళ్లిన ఆయన ఆదివారం ఉదయం తిరిగి ముంబై చేరుకొని అసెంబ్లీకి హాజరయ్యారు.

First published:

Tags: Bjp, Eknath Shinde, Maharashtra, Shiv Sena

ఉత్తమ కథలు