హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. 75,000 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..

కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. 75,000 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరాకు కానుకగా 75 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

మహారాష్ట్రలో (maharashtra) గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచిచూస్తున్న ఉద్యోగాలకు కొత్త సీఎం ఏక్ నాథ్ షిండే (Eknath shinde) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. కాగా, ఎంవీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిలిచిపోయిన మెట్రో, ఇతర ప్రాజెక్టులను తమ ప్రభుత్వం ప్రాధాన్యతపై చేపట్టిందని సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు. గత 2.5 ఏళ్లలో ఆగిపోయిన రిక్రూట్‌మెంట్ (job notification)  ప్రక్రియను తమ ప్రభుత్వం ప్రారంభించిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదివారం తెలిపారు.

75,000 మంది రిక్రూట్‌మెంట్ (Job Recruitment)  ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ముఖ్యమంత్రి చెప్పారు. "తాము జాబ్ ఇచ్చేవారిని సృష్టించాలనుకుంటున్నామని, ఉద్యోగాలను (Unemployed) ఆశించేవారిని కాదని ఆయన చెప్పారు. మేము మంత్రాలయ (రాష్ట్ర సచివాలయం)లో కూర్చొని నిర్ణయాలు తీసుకోము, మేము ప్రజలతో మమేకమై వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని సీఎం అన్నారు. మా ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతికూలతను తొలగించి సానుకూలతను తీసుకొచ్చింది. ఇది పౌరుల్లో ‘నవ చైతన్య’ (కొత్త చైతన్యం) తీసుకొచ్చిందని షిండే అన్నారు.

ఈ ఏడాది జూన్ నెలాఖరులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల ఫైళ్లను క్లియర్ చేసిందని షిండే తెలిపారు. కాగా, గుజరాత్‌లో వేదాంత-ఫాక్స్‌కాన్ మల్టీ-బిలియన్ సెమీకండక్టర్ ప్రాజెక్ట్ జరుగుతున్న నేపథ్యంలో షిండే మాట్లాడుతూ, “ పరిశ్రమలు వస్తే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. నవీ ముంబయిలో మత్తడి నేత దివంగత అన్నాసాహెబ్‌ పాటిల్‌ స్మారకార్థం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల జాబితాను వివరించారు. "తాము ఇక్కడ సత్యం (సత్యం) కోసం ఉన్నాము, సత్తా (పవర్) కోసం కాదని షిండే స్పష్టం చేశారు.

తమది "డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని, వ్యతిరేకులు దానికి భయపడుతున్నారని అన్నారు. తాను ఎవరిపైనా వ్యాఖ్యానించబోనని, గత రెండున్నరేళ్లలో పనుల వేగాన్ని మహారాష్ట్ర ప్రజలు స్వయంగా చూశారని సీఎం అన్నారు. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో నిలిచిపోయిన మెట్రోతో సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతపై చేపట్టి ఇప్పుడే ప్రారంభించడం జరిగిందని షిండే అన్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Job notification, Job recruitment, Maharashtra

ఉత్తమ కథలు