ఇక మాల్స్, మల్టిప్లెక్స్‌లు 24/7 తెరిచే ఉంటాయ్..!

మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 గంటల పాటు షాపింగ్‌ మాల్స్, మల్టిప్లెక్స్‌లు, మిల్స్‌ తెరిచే ఉంచేలా కీలక నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: January 23, 2020, 7:53 AM IST
ఇక మాల్స్, మల్టిప్లెక్స్‌లు 24/7 తెరిచే ఉంటాయ్..!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొందరికి అర్ధరాత్రి థియేటర్‌లో సినిమా చూడాలని ఉంటుంది.. కానీ, వీలు కాదు. ఎందుకంటే రాత్రి 12 దాటితే అన్ని థియేటర్లలో షోలు ముగుస్తాయి. మళ్లీ తెల్లారితే తప్ప సినిమా హాళ్లలో సినిమాలు చూడలేం. అంతేకాదు.. షాపింగ్ చేయాలన్నా రాత్రి 10 గంటల వరకే అవకాశం. అయితే.. మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 గంటల పాటు షాపింగ్‌ మాల్స్, మల్టిప్లెక్స్‌లు, మిల్స్‌ తెరిచే ఉంచేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహారాష్ట్ర కేబినెట్ ముంబై 24/7 ప్లాన్‌కు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్లాన్ ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది.

దీనిపై సంబంధిత వర్గాలు మాట్లాడుతూ.. రోజంతా మాల్స్, మల్టిప్లెక్స్‌లు తెరిచే ఉంచాలన్న నిర్ణయానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని తెలిపాయి. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్, ముంబై పోలీసులను సంప్రదించాకే ఈ ప్రతిపాదనను మంత్రి వర్గం ముందు ఉంచినట్లు స్పష్టం చేశాయి.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు