మహారాష్ట్ర (Maharastra) లో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్‌లో ఓ బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారుఝామున 05:15 గంటల సమయంలో నాసిక్-ఔరంగాబాద్ హైవేపై హోటల్ చిల్లీ చౌక్ వద్ద ఈ ఘటన (Bus Catches Fire in Nashik) జరిగింది. ప్రమాదంలో 10 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. మరో 34 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఐతే మృతుల సంఖ్య ఎంతన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. యవత్మాల్ నుంచి ముంబై (Mumbai) వెళ్తున్న ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు.. ట్రక్కును ఢీకొట్టింది. అతివేగంతో అదుపుతప్పి.. ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో.. బస్సు 50 నుంచి 60 అడుగుల ముందుకు పడిపోయింది. డీజిల్ ట్యాంకర్ పగిలిపోవడంతో బస్సులో మంటలు చెలరేగాయి.
औरंगाबाद रोडवरील हॉटेल मिरची चौकात लक्झरी बस आणि टँकर यांच्यात शनिवारी पहाटे भीषण अपघातात झाला. या अपघातानंतर चिंतामणी ट्रॅव्हलच्या बसने पेट घेतला. या आगीत बसमधील जवळपास सात ते आठ प्रवासी जळून खाक झाल्याची दुर्दैवी घटना घडली आहे pic.twitter.com/bKgxPnzmGl
— News18Lokmat (@News18lokmat) October 8, 2022
కొందరు ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బస్సులో నుంచి దూకేందుకు ప్రయత్నించారు. డోర్ నుంచి కొందరు, కిటికీల నుంచి ఇంకొందరు దూకడంతో.. వారికి కూడా గాయపడ్డాడు. ఆ తర్వాత చూస్తుండగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పలువురు ప్రయాణికులు బయటకు రాలేక.. లోపలే చిక్కుకుపోయారు. వారంతా మంటల్లో కాలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఉంచారు.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటల్లో కాలిపోయి.. 11 మంది ప్రయాణికులు చనిపోయారు. వారి మృతదేహాలను నాసిక్ (Nashik) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలు గుర్తుపట్టరాని విధంగా కాలిపోయాయి. మాంసపు ముద్దలుగా మారిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 40-50 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bus accident, Fire Accident, Maharashtra