హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వరుస ప్రమాదాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. మరోసారి ధ్వంసమైన ఇంజిన్ ముందు భాగం..

వరుస ప్రమాదాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. మరోసారి ధ్వంసమైన ఇంజిన్ ముందు భాగం..

మరమ్మత్తులు చేపట్టిన అధికారులు

మరమ్మత్తులు చేపట్టిన అధికారులు

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ ప్రెస్ సెమి హైస్పీడ్ రైలు ముందు భాగం మరోసారి ధ్వంసమైంది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైలును (Vande Bharat Expres)   గాంధీ నగర్, ముంబై మార్గంలో ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. గుజరాత్ నుంచి వెళ్తున్న ఈ ట్రైన్.. ఆనంద్ స్టేషన్ సమీపంలో ఆవును ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ ముందు భాగం మరోసారి ధ్వంసమైంది. కాగా, గురువారం నాడు కూడా వందే భారత్ రైలు.. నాలుగు గేదెలను ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇంజిన్ ముందు భాగం ధ్వంసమైంది. దీంతో అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టి దాన్ని ప్రారంభించారు.

అయితే.. ఈ క్రమంలో మరోసారి పట్టాల మీద వచ్చిన ఆవును ఢీకొట్టింది. ఇప్పుడు రైలు ముందు భాగంలో కొద్దిగా ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. తాజా సంఘటన ముంబైకి 432 కి.మీ దూరంలోని ఆనంద్ సమీపంలో మధ్యాహ్నం 3.48 గంటలకు జరిగింది. రైలు ముందు భాగం చిన్న డెంట్‌పడిందని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. అదే విధంగా ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

ఇదిలా ఉండగా  ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) ప్రమాదానికి గురైంది. ఈ రైలు గాంధీనగర్- ముంబైకి రాకపోకలు సాగిస్తుంటుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తుంది. కానీ ప్రమాద సమయంలో 100 కిలోమీటర్ల వేగంతోనే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. గుజరాత్ నుండి గాంధీనగర్ కు వచ్చే క్రమంలో వాత్వా స్టేషన్ వద్దకు రాగానే గేదెల గుంపు అడ్డు వచ్చింది. ఈ క్రమంలో లోకల్ పైలట్ సడెన్ బ్రేక్ వేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గేదెల మందను ఢీకొట్టడంతో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఇంజన్ ముందుభాగం తుక్కు తుక్కయింది.  ఈ ప్రమాదంలో నాలుగు గేదెలు మృతి చెందాయి. ఈ ప్రమాదం ఉదయం 11.15 గంటల సమయానికి జరిగినట్లు తెలుస్తుంది.

అక్టోబర్ 30న ప్రారంభం

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) సెప్టెంబర్ 30న ప్రారంభించారు. 16 కోచ్ లు ఉన్న ఈ రైలులో 1,128 మంది ప్యాసింజర్లు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ హై స్పీడ్ రైలు అత్యాధునిక ప్రమాణాలతో రూపొందించారు. ఈ రైలులో ప్రయాణించేటప్పుడు అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు. ఈ రైలు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా కవచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి అనుసంధానించారు. కానీ ఇది రైళ్ల వరకే పని చేస్తుందని, పట్టాలపై ఏదైనా ఉంటే మాత్రం ఈ పరిజ్ఙానం ఉపయోగపడదని తెలుస్తుంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bombay, Maharashtra, Pm modi, Vande Bharat Train

ఉత్తమ కథలు