మహారాష్ట్రలో బీజేపీ, శివసేన హావా...అసెంబ్లీ ఎన్నికల ముందు జోష్ నింపిన ఫలితాలు...

మరో కొద్ది నెలల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన, బీజేపీ కూటమి సాధించిన ఈ విజయం శ్రేణుల్లో పూర్తి ఉత్సాహాన్ని నింపనుంది. మొత్తం 48 సీట్లు ఉన్న మహారాష్ట్రలో బీజేపీకి 24 సీట్లలో ఆధిక్యంలో ఉంటే, 19 సీట్లలో శివసేన స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.

news18-telugu
Updated: May 23, 2019, 2:40 PM IST
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన హావా...అసెంబ్లీ ఎన్నికల ముందు జోష్ నింపిన ఫలితాలు...
సంబరాలు జరుపుకొంటున్న బీజేపీ కార్యకర్తలు. (Image: PTI)
  • Share this:
మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి బంపర్ మెజారిటీతో దూసుకెళుతోంది. మరో కొద్ది నెలల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన, బీజేపీ కూటమి సాధించిన ఈ విజయం శ్రేణుల్లో పూర్తి ఉత్సాహాన్ని నింపనుంది. మొత్తం 48 సీట్లు ఉన్న మహారాష్ట్రలో బీజేపీకి 24 సీట్లలో ఆధిక్యంలో ఉంటే, 19 సీట్లలో శివసేన స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి మాత్రం కుదేలైంది. ఎన్సీపీ 4 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తే, కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక్కసీటులోనే అధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమి ఇంతలా భారీ మెజారిటీతో దూసుకెళ్లడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. 2014లో సైతం బీజేపీ మహారాష్ట్రలో మొత్తం 23 స్థానాల్లో సాధించగా, శివసేన సైతం 18 సీట్లలో విజయం సాధించింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 122 సీట్లు సాధింగా, శివసేన 63సీట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. అయితే అతిపెద్ద పార్టీ అవతరించిన బీజేపీ పార్టీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో శివసేన కాస్త పెడమొఖం పెట్టినప్పటికీ చివరికి సహకారం అందించింది. మరోవైపు 2019 సాధారణ ఎన్నికల్లో మాత్రం రెండు పార్టీలు ఎన్డీఏగా ప్రజల ముందుకొచ్చాయి. అయితే బీజేపీ ఈ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యం ప్రదర్శించడం విశేషం.

మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయిలో రాణించేందుకు ఈ ఎన్నికలు దోహదపడ్డాయనే చెప్పవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పూర్తిగా క్షీణించడంతో ఆ పార్టీ ఉనికికే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే ఎన్సీపీ సైతం కాంగ్రెస్ తో జత కట్టేందుకు ప్రస్తుతం సందేహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీంతో ఎన్సీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి స్పష్టమైన విజయం దిశగా సాగేందుకు, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ఉత్సాహం నింపిందనే చెప్పవచ్

First published: May 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>