నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు ఊహించని షాక్ తగిలింది. నకిలీ కుల ధృవీకరణ పత్రం సమర్పించినందుకు ఆమెకు బాంబే హైకోర్టు రూ. 2 లక్షల జరిమానా విధించింది. అయితే ఈ కారణంగా ఆమె ఎంపీ పదవికి గండం ఏర్పడే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంబ్ ఈ మేరకు జరిమానా విధించింది. ఈ సర్టిఫికెట్లు సరైనవే అని నిర్ధారించుకునేందుకు కోర్టు నవనీత్ కౌర్‌కు నెల రోజుల సమయం ఇచ్చింది. ఒకవేళ ఆమె నెలలోపు ఈ విషయాన్ని నిరూపించలేకపోతే లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కోర్టు విధించిన జరిమానా మొత్తాన్ని మహారాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.
అయితే హైకోర్టు తీర్పుపై ఎంపీ నవనీత్ కౌర్ స్పందించారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని అన్నారు. దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళతానని అన్నారు. అక్కడ తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.
I respect the court's order as a citizen of this country. I will approach the Supreme Court, I am confident that I will get justice: Amravati MP Navneet Rana pic.twitter.com/oPQwLuEHkG
— ANI (@ANI) June 8, 2021
శివసేన నాయకుడు ఆనందరావు ఆద్సుల్ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నటిగా రాణించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నవనీత్ కౌర్.. అమరావతి నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగి ఎంపీగా విజయం సాధించారు. ఏడు భాషల్లో మాట్లాడగలగడం 35 ఏళ్ల నవనీత్ కౌర్ ప్రత్యేకత. పార్లమెంట్లో తన ప్రసంగాల ద్వారా అనేక సార్లు ప్రజల దృష్టిని ఆకర్షించారు. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని ఆమె గతంలో లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bombay high court