హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది... లెక్కతేల్చిన పురావస్తు తవ్వకాలు

మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది... లెక్కతేల్చిన పురావస్తు తవ్వకాలు

MahaBharat : మన పురాణాల్లో ఒకటైన మహాభారతం ఎప్పుడు జరిగిందన్నదానిపై రకరకాల ఊహాగానాలున్నాయి. అసలు మహాభారతమే జరగలేదు అన్నవారూ ఉన్నారు. ఐతే... పురావస్తు తవ్వకాల ఆధారంగా మహాభారతం ఎప్పుడు జరిగిందో కొన్ని లెక్కలు చెబుతున్నారు పరిశోధకులు.

ఇంకా చదవండి ...

  MahaBharat : తింటే గారెలు తినాలి... వింటే మహాభారతం వినాలి అంటారు పెద్దలు. మన దేశంలో మహాభారతానికి ఉన్న ప్రాసస్థ్యం అది. ఐతే... మహాభారతాన్ని ఎంత మంది ఎన్ని రకాలుగా రాసినా... అది ఎప్పుడు జరిగిందన్నదానిపై ఒక్కొక్కరికీ ఒక్కో టైమ్‌లైన్ ఉంటోంది. బట్... మనం ఏదైనా నమ్మాలంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి కదా... అనేవారికి తాజాగా కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు పురావస్తు పరిశోధకులు. వారు చెబుతున్నదాని ప్రకారం... మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 2000 నుంచి క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల కిందట జరిగింది. భారత పురావస్తు సంస్థ డైరెక్టర్‌ మంజుల్‌ టీమ్ తాజాగా తవ్వకాలు జరిపించింది. వాటి కంటే ముందు... 1951-52లో బీబీ లాల్‌ అనే పరిశోధకుడు ఢిల్లీ దగ్గర్లోని హస్తినాపూర్‌, ఇంద్రప్రస్థ ప్రాంతాల్లో జరిపినవి అత్యంత కీలకంగా నిలిచాయి. అక్కడ కొన్ని వస్తువులు దొరికాయి. వాటి ఆధారంగా... మహాభారత యుద్ధం... క్రీస్తు పూర్వం 1000-900 మధ్య జరిగినట్లు అప్పట్లో అంచనా వేశారు. కానీ... ఇప్పుడా అంచనా తప్పని తేల్చారు.

  2018లో మంజుల్‌ టీమ్... ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలోని సనౌలీ అనే ఊరిలో తవ్వకాలు జరిపింది. గుర్రంతో నడిపిన రథం (మహాభారతంలో వాడినట్లు ఉన్నది), గుర్రాలను కంట్రోల్ చేసే కొరడా, రథ చక్రాలు, హెల్మెట్స్ (శిరస్త్రాణాలు - యుద్ధంలో వాడేవి) పిడి కత్తి, డాలు, బాణం, విల్లు, ఒక శ్మశాన వాటిక, రక్షణ కవచాలు, పతాక ధ్వజం వంటివి ఆ తవ్వకాల్లో దొరికాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే తేలిందేంటంటే... మహాభారత యుద్ధంలో అలాంటివే వాడారని చరిత్ర చెబుతోంది.

  అక్కడ కొన్ని పాత్రలు, రాణి నాణేలు కూడా దొరికాయి. అవి ఎప్పటివో కార్బన్ డేటింగ్ పరీక్షలు జరిపారు. అవి క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాటివిగా తేలింది. అందువల్లే మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 2000-1500 మధ్య జరిగినట్లుగా అంచనాకు వచ్చారు. ఐతే... తాజా అంచనాలే కరెక్ట్ అని మనం నిర్ధారణకు వచ్చేయలేం. అదే నిజమైతే... మరి ఇదివరకు అంచనా ఎందుకు రాంగ్ అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ఆల్రెడీ బీబీలాల్ స్పందించారు. తాను చెప్పినదే రైట్ అంటున్నారు ఆయన. ఎందుకంటే మహాభారతంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థ గురించి ఉందని అంటున్నారు. ఎవరి వాదన వారిది... ఎవరి లెక్కలు వారివి.

  Nithya Menen : క్యూట్‌గా కనిపించే నిత్యా మీనన్ స్వీట్ ఫొటోస్...

  ఇవి కూడా చదవండి :

  బీజేపీలో టీడీపీ కలిసిపోతుందా? జీవీఎల్ సంకేతాలు ఇస్తున్నారా?

  నెక్ట్స్ ఏంటి... ఇవాళ తేల్చనున్న ఆర్టీసీ జేఏసీ

  Health Tips : కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

  Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

  Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

  First published:

  Tags: Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు