హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Metro Rail Jobs : పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.ల‌క్ష‌పైనే

Metro Rail Jobs : పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.ల‌క్ష‌పైనే

పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు

పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు

మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ (Maharashtra Metro Rail Corporation) పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 14, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది

ఇంకా చదవండి ...

మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ (Maharashtra Metro Rail Corporation) పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మెట్రో రైలు, రైల్వేలు, రైల్వే సీఎస్‌యులు, ప్రభుత్వ సంస్థలు, పిఎస్‌యులు మరియు మెట్రో సంబంధిత మౌలిక సదుపాయాలు మరియు పరిశ్రమలలో అనుభవం ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీక‌రించనుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 14, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ విభాగాల్లో టెక్నిషియ‌న్‌లు, ఇంజ‌నీర్‌లు (Engineers), సెక్ష‌న్ ఇంజ‌నీర్‌లు, సీనియ‌ర్ ఇంజ‌నీర్ పోస్టుల‌కు సంబంధించి 96 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.punemetrorail.org/ ను సంద‌ర్శించాలి.

పోస్టుల వివ‌రాలు.. జీతం

పోస్టు పేరు ఖాళీలుజీతం
అడిషిన‌ల్ చీఫ్ ప్రాజెక్టు మేనేజ‌ర్ 01రూ.1,00,000 – రూ.2,60,000
సీనియ‌ర్ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ 01రూ.80,000 – రూ.2,20,000
డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌01రూ.70,000 – రూ.2,00,000
అసిస్టెంట్ మేనేజ‌ర్‌01రూ.50,000 – రూ.1,60,000
సీనియ‌ర్ సెక్ష‌నల్ కంట్రోల‌ర్‌23రూ.40,000 – రూ.1,25,000
సీనియ‌ర్ సెక్ష‌న్ ఇంజ‌నీర్ (ట్రాక్‌)01రూ.46,000 – రూ.1,45,000
సీనియ‌ర్ సెక్ష‌న్ ఇంజ‌నీర్ (ట్రాక్ష‌న్‌)01రూ.46,000 – రూ.1,45,000
సీనియ‌ర్ సెక్ష‌న్ ఇంజ‌నీర్ (ఎంఈపీ) 01 రూ.46,000 – రూ.1,45,000
సెక్ష‌న్ ఇంజ‌నీర్ (ఐటీ) 01 రూ.40,000 – రూ.1,25,000
జూనియ‌ర్ ఇంజ‌నీర్ (సిగ్న‌ల్‌) 03రూ. 33,000 – రూ.1,00,000
జూనియ‌ర్ ఇంజ‌నీర్ (ట్రాక్ష‌న్‌) 11 రూ.33,000 – రూ.1,00,000
జూనియ‌ర్ ఇంజ‌నీర్ (ఎంఈపీ) 01 రూ.33,000 – రూ.1,00,000
జూనియ‌ర్ ఇంజ‌నీర్ (సివిల్‌) 03 రూ.33,000 – రూ.1,00,000
సీనియ‌ర్ టెక్నీషియ‌న్ (ట్రాక్ష‌న్‌) 12  రూ.33,000 – 1,00,000
సీనియ‌ర్ టెక్నీషియ‌న్ (ఎంఈపీ) 05 రూ.33,000 – రూ.1,00,000
సీనియ‌ర్ టెక్నీషియ‌న్ (Mason) 05 రూ.33,000 – రూ.1,00,000
సీనియ‌ర్ టెక్నీషియ‌న్ (సిగ్న‌ల్‌) 09 రూ.33,000 –రూ. 1,00,000
సీనియ‌ర్ టెక్నీషియ‌న్ (ఫిట్ట‌ర్‌ 12 రూ.33,000 – రూ.1,00,000
ఎకౌంట్ అసిస్టెంట్ ఫైనాన్స్ 04 రూ.25,000– రూ.80,000

ఎంపిక విధానం..

- ఎంపిక విధానం ఇంట‌ర్వ్యూ ద్వారా ఉంటుంది.

- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థి అకాడ‌మిక్ మెరిట్‌, అనుభ‌వం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

- షార్ట్ లిస్ట్ అయిన అభ్య‌ర్థులకు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి ఎంపిక చేస్తారు.

ECIL Jobs : హైదరాబాద్ ఈసీఐఎల్‌లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. జీతం రూ.23,000

అర్హ‌త‌లు..

- ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు 60శాతం మార్కుల‌తో ఆయా విభాగాల్లో ఇంజ‌నీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

- ప‌బ్లిక్‌సెక్టార్‌, పీఎస్‌యూల‌లో సంబంధిత విభాగాల్లో అనుభ‌వం ఉండాలి.

- ప్ర‌తీ పోస్టుకు ప్ర‌త్యేక వ‌యోప‌రిమితి ఉంటుంది చూసుకోవాలి

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది.

Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.mahametro.org/Career.aspx ను సందర్శించాలి .

Step 3 :  అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4 :  నోటిఫికేష‌న్ చ‌దివిన త‌రువాత "Apply Online" ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

Step 5 :  అనంత‌రం పేరు రిజిస్ట‌ర్ చేసుకోవాలి.

Step 6 :  త‌రువాత అప్లికేష‌న్ ఫాంను త‌ప్పులు లేకుండా నింపాలి.

Step 7 :  పోస్టుకు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు అవ‌స‌ర‌మైన ఫార్మెట్‌లో అప్‌లోడ్ చేయాలి.

Step 8 :  త‌రువాత ఫీజు చెల్లించి. అప్లికేష‌న్ సేవ్ చేసి స‌బ్‌మిట్ చేయాలి.

Step 9 :  అప్లికేష‌న్ ఫాం ఓ కాపీని ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

Step 10 :  ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 14, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: CAREER, Govt Jobs 2021, Job notification, Maharastra, Railway jobs