మరో రికార్డ్ దిశగా కుంభమేళా... ఇవాళ కోటి మంది పుణ్య స్నానాలు

Maha Kumbh Mela 2019 : మహా శివరాత్రి, కుంభ మేళా చివరి రోజు కావడంతో ప్రయాగ రాజ్ భక్తులతో పోటెత్తుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: March 4, 2019, 6:13 AM IST
మరో రికార్డ్ దిశగా కుంభమేళా... ఇవాళ కోటి మంది పుణ్య స్నానాలు
కుంభ మేళాకు తరలివచ్చిన భక్తులు
  • Share this:
మహా శివరాత్రి పండుగ నాడు కుంభ మేళాకు వచ్చే యాత్రికుల సంఖ్య ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లో కుంభ మేళాకు ఇవాళే చివరి రోజు. గంగా, యమున, సరస్వతి పవిత్ర సంగమంలో స్నానం చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, యాత్రికులూ, సాధువులూ ప్రయాగ రాజ్ చేరుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 22 కోట్ల మంది హిందువులు కుంభ మేళాలో స్నానం చేసినట్లు అధికారులు తెలిపారు. శివుడికి ఇష్టమైన సోమవారం రోజే శివరాత్రి కావడం, శివుడి వివాహం జరిగినది కూడా ఇవాళే కావడంతో పవిత్రమైన ఈ రోజున ముక్కోటి దేవతలూ ఆశీర్వదిస్తారని నమ్మకం. ఇవాళ కోటి మంది భక్తులు వస్తారని అంచనా. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.కుంభమేళా కోట్ల మంది భక్తులు ఒక చోట కలిసే ఉత్సవం. విశ్వంలో మరెక్కడా ఇంత పెద్ద ఎత్తున మతపరమైన ఉత్సవం జరగట్లేదు. ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి రోజున కుంభమేళా మొదలైంది. మార్చి 4తో ముగుస్తోంది. ఇదివరకటి కంటే ఈసారి కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. శివలింగాలకు రుద్రాభిషేకాలు చేశారు. పవిత్రస్నానాలు మకర సంక్రాంతి జనవరి 15, మౌని అమావాస్య ఫిబ్రవరి 4, బసంత్ పంచమి ఫిబ్రవరి 10న జరిగాయి.

కుంభ మేళాను తొమ్మిది జోన్లుగా విభజించారు. వాటిని 20 సెక్టార్లుగా విభజించారు. 20వేల మంది పోలీసులు, 6000 మంది హోంగార్డులను నియమించారు. 80 కంపెనీల రాష్ట్ర రిజర్వు పోలీసు బలగాలు, 20 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. 40 ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించేందుకు, కనిపెట్టేందుకు నిఘా విభాగాల్ని అప్ గ్రేడ్ చేశారు. ఇప్పుడు జరిగే మహా కుంభ మేళా 12 ఏళ్లకోసారి వస్తుంది. అర్థ కుంభమేళాను ఆరేళ్లకోసారి నిర్వహిస్తారు.
3 గిన్నిస్ రికార్డులు : కుంభమేళాలో నిర్వాహకులు, వాలంటీర్లు మరో గిన్నిస్ రికార్డు సాధించారు. ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ ద్వారా శనివారం భారీ క్లీనింగ్ కార్యక్రమం చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో వాలంటీర్లు చీపుర్లతో రోడ్లను శుభ్రం చేసి గిన్నిస్ రికార్డు సాధించారు. మూడు రోజుల్లో ఇది మూడో గిన్నిస్ రికార్డు. గురువారం పెయింట్ మై సిటీ పేరుతో 7,664 మంది వాలంటీర్లు 8 గంటల పాటు చేతిముద్రలు వేసి రికార్డు సృష్టించారు. అంతకుముందు ఫిబ్రవరి 28న 500 బస్సులతో అతిపెద్ద బస్సు యాత్ర చేసి గిన్నిస్ రికార్డు నమోదు చేశారు. ఇలా ఈసారి కుంభమేళా ఎన్నెన్నో ప్రత్యేకతలతో ముగుస్తోంది.

ఇవి కూడా చదవండి :

సమ్మర్‌లో సబ్జా గింజలు తాగితే చాలు... ఎంతో ఆరోగ్యం...

కొబ్బరి బోండాంలో లేత కొబ్బరి తింటున్నారా... ఈ ప్రయోజనాలు మీకే

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...

పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా... ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే
First published: March 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading