Earthquake : హర్యానాలో గత రాత్రి 1.19కి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.8గా నమోదైంది. ఐతే.. ప్రకంపనల తీవ్రత ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాలకూ వ్యాపించాయి. హర్యానాలోని ఝజ్జార్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అక్కడ భూకంపం.. భూమి ఉపరితలానికి 5 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాకపోతే.. కొత్త సంవత్సరం శుభాలతో మొదలవ్వాలని కోరుకున్న ఢిల్లీ వాసులకు ఈ భూకంపం షాకిచ్చినట్లైంది. అయినా ఏమీ జరగలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలకు భూకంపాల సమస్య ఎప్పుడూ ఉంటుంది. కోట్ల సంవత్సరాల కిందట.. భారత భూభాగం.. ఆసియా ఖండాన్ని ఢీకొట్టడం వల్ల భారీ రాపిడి జరిగి.. హిమాలయ పర్వతాలు పుట్టాయి. ఈ పరిస్థితి వల్ల అక్కడి భూమి లోపలి పలకాలు తరచూ కదులు.. సరి అవుతూ ఉంటాయి. అందువల్లే ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపాలు వస్తూ ఉంటాయి.
రిక్టర్ స్కేలుపై తీవ్రత 4 కంటే తక్కువగా ఉన్న భూకంపాలను చిన్న భూకంపాలుగా చెబుతారు. ఇవి తరచూ వస్తూనే ఉంటాయి. చాలాసార్లు ఇవి వచ్చిన విషయం కూడా తెలియదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Earth quake, Earthquake, Haryana