కరోనా నుంచి కోలుకున్న మాఫియా డాన్.. మళ్లీ జైలుకు చోటా రాజన్

ఛోటా రాజన్ (ఫైల్ ఫోటో)

Chota Rajan: చికిత్స పొందుతున్న సమయంలో చోటా రాజన్‌ మృతి చెందాడనే ఊహాగానాలు వ్యాపించాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చోటా రాజన్‌ మృతి చెందారనే వార్త వైరల్‌గా మారింది.

  • Share this:
    కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడటంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందిన అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. కోవిడ్ 19 నుంచి కోలుకున్నాడు. వైరస్ నుంచి చోటా రాజన్ పూర్తిగా కోలుకోవడంతో అతడిని తిరిగి తీహార్ జైలుకు తరలించారు పోలీసులు. గత నెల 22న రాజన్‌ కరోనా వైరస్‌ బారినపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడికి వైద్యం అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో చోటా రాజన్‌ మృతి చెందాడనే ఊహాగానాలు వ్యాపించాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చోటా రాజన్‌ మృతి చెందారనే వార్త వైరల్‌గా మారింది.

    అయితే దీనిపై ఎయిమ్స్ అధికారులు స్పందించారు. చోటా రాజన్‌కు ఇంకా చికిత్స కొనసాగుతోందని.. అతడు మరణించలేదని వెల్లడించారు. కొద్దిరోజుల పాటు కరోనాకు ఎయిమ్స్‌లోనే చికిత్స పొందిన చోటా రాజన్ కోలుకోవడంతో.. అతడిని అధికారులు తిరిగి తిహార్‌ జైలుకు తరలించారు.

    రాజన్‌పై 70 వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో ఎక్కువశాతం కిడ్నాప్‌లు, మర్డర్ కేసులే. ఛోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నిఖాల్జే. సుమారు రెండు దశాబ్దాలుగా భార‌తో పాటు అనేక ప్రపంచ దేశాలకు దొరక్కకుండా తన క్రిమినల్ కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చిన ఛోటా రాజన్‌ ఇంటర్ పోల్ వర్గాలు ఇచ్చిన ఇచ్చిన సమాచారంతో 2015లో అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు అతడిని ఇంటర్‌పోల్ వర్గాలు ఇండోనేషియాలోని బాలిలో అరెస్టు చేశారు. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సహచరుడైన ఛోటా రాజన్.. ఆ తర్వాత అతడికి గట్టి ప్రత్యర్థిగా మారాడు. ముంబై పోలీసులు, భారత నిఘా ఏజెన్సీలు దాదాపు రెండు దశాబ్దాలు పాటు అన్వేషణ సాగించారు. 1995 నుంచి తప్పించుకున్న ఛోటా రాజన్.. ముంబైలోని నేర సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి.

    ఇదిలా ఉంటే ఓ కేసుకు సంబంధించి ఇటీవల ఛోటా రాజన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. బిల్డర్ అజయ్ గోసాలియాపై హత్యాయత్నం కేసులో గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్​కు ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 10 ఏండ్ల జైలుశిక్ష విధించింది. ఈ కేసులో రాజన్​తోపాటు మొత్తం 8 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. పదేండ్ల జైలుశిక్షతోపాటు 5లక్షల రూపాయల జరిమానా వేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published: