అరుదైన వ్యాధి.. తలపై కొమ్ము లాంటి వికృత ఆకారం..

Devil Horn : సాధారణంగా దీన్ని డెవిల్ హార్న్ అంటారని.. వైద్య పరిభాషలో సెబాసియస్ హార్న్ అంటారని వైద్యులు తెలిపారు.

news18-telugu
Updated: September 14, 2019, 11:53 AM IST
అరుదైన వ్యాధి.. తలపై కొమ్ము లాంటి వికృత ఆకారం..
తలపై కొమ్ము లాంటి ఆకారంతో శ్యామ్‌లాల్..
  • Share this:
మధ్యప్రదేశ్‌లో 74 ఏళ్ల శ్యామ్‌లాల్ అనే ఓ వృద్దుడు అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం శ్యామ్‌లాల్ తలపై గాయం కాగా.. ఆ తర్వాత కొన్ని రోజులకు దాని స్థానంలో కొమ్ము లాంటి ఆకారం ఏర్పడింది.తలపై చర్మం పొడుగ్గా పెరిగి వికృతంగా కనిపించడం మొదలుపెట్టింది. దాంతో శ్యామ్‌లాల్ ఇంట్లోనే దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండేవాడు. అయితే కట్ చేస్తున్నకొద్ది అది పెరుగుతూనే ఉండటంతో.. ఇటీవలే వైద్యులను సంప్రదించాడు.

భోపాల్‌లోని సాగర్ భాగ్యోదయ్ ఆస్పత్రి వైద్యులు శ్యామ్‌లాల్‌కు వైద్యం చేసి ఎట్టకేలకు దాన్ని తొలగించారు. దీంతో శ్యామ్‌లాల్‌కు ఉపశమనం లభించినట్టయింది. సాధారణంగా దీన్ని డెవిల్ హార్న్ అంటారని.. వైద్య పరిభాషలో సెబాసియస్ హార్న్ అంటారని వైద్యులు తెలిపారు. ఎండ వేడి తగిలే ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా ఏర్పడుతుందని చెప్పారు.మరోసారి అలాంటి హార్న్ రాకుండా సర్జరీ చేసి దాన్ని పూర్తిగా తొలగించామని చెప్పారు.
Published by: Srinivas Mittapalli
First published: September 14, 2019, 11:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading