హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

హిడ్మా లాంటి మావోయిస్టులు కొద్దిరోజుల్లోనే కాలగర్భంలో కలిసిపోతారు : సీఆర్పీఎఫ్ చీఫ్ కుల్దిప్ సింగ్

హిడ్మా లాంటి మావోయిస్టులు కొద్దిరోజుల్లోనే కాలగర్భంలో కలిసిపోతారు : సీఆర్పీఎఫ్ చీఫ్ కుల్దిప్ సింగ్

సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ (Image:ANI)

సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ (Image:ANI)

హిడ్మా లాంటివాళ్లు కొద్దిరోజుల్లోనే కాలగర్భంలో కలిసిపోతారు : సీఆర్పీఎఫ్ చీఫ్ సంవత్సర కాలంలోనే మావోయిస్టులను ఏరిపారేస్తమని హెచ్చరిక దొంగచాటుగా పోలీసులపై విరుచుకుపడ్డారని వెల్లడి.

చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ తర్వాత అటు మావోయిస్టులు ఇటు పోలీసుల మధ్య భీకర వాతవరణం ఏర్పడుతోంది. దీంతో దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియిని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల మధ్య మాటల యుద్దం కూడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఆర్పీఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లోనే హిడ్మా లాంటి వారు ఇక చరిత్రగానే

మిగిలిపోతారని అలాంటీ వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని సంచలన ప్రకటన చేశారు.న్యూస్ 18 జాతీయ చానల్ ఇచ్చిన ఇంటర్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా మావోయిస్టులపై కుల్దీప్ సింగ్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోయారని, అతి త్వరలోనే ఓ పెద్ద ఆపరేషన్ చేపడతామని ప్రకటించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేశామని వెల్లడించారు. దొంగచాటుగా పోలీసులపై విరుచుకుపడుతున్నారని, ఇకపై వారి ముందు రెండే రెండు ఆప్షన్లు ఉంటాయని హెచ్చరించారు. వారిని ఏరిపారేయడం మొదటి ఆప్షన్‌ అని, లేదా వారంతట వారే పారిపోవడం రెండో ఆప్షనని పేర్కొన్నారు. ఇంతకు పూర్వం మావోయిస్టులు 100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేవారని, ఇప్పుడు కేవలం 20 కిలోమీటర్లకే పరిమతమయ్యారని అన్నారు.

సంవత్సర కాలంలో వారిని ఖచ్చితంగా ఏరిపారే్స్తామని అన్నారు. నక్సలైట్లు పన్నిన ఉచ్చులో భద్రతా బలగాలు చిక్కాయన్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. చిక్కులో గనక చిక్కినట్లయితే మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండేదన్నారు. మరణించిన నక్సలైట్లను మిగతా నక్సలైట్లు నాలుగు ట్రాక్టర్లలో తీసుకెళ్లారని కుల్దీప్ సింగ్ పేర్కొన్నారు.

First published:

Tags: CRPF, Encounter, Maoist attack

ఉత్తమ కథలు