హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Madrassa Demolished : బుల్డోజర్స్ తో మదర్సాని కూల్చివేసిన సర్కార్..టీచర్ అరెస్ట్

Madrassa Demolished : బుల్డోజర్స్ తో మదర్సాని కూల్చివేసిన సర్కార్..టీచర్ అరెస్ట్

మదర్సా కూల్చివేత

మదర్సా కూల్చివేత

Madrassa Demolished : ఉగ్ర‌సంస్థ‌ల‌తో సంబంధాలున్న మదర్సా(Madrassa)లపై అసోం(Assam) ప్రభుత్వం స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశీ జిహాదీ సంస్థలతో సంబంధం ఉన్న మదర్సా నిర్మాణాలను తొలగించిన అసోం ప్రభుత్వం తాజాగా మరో మదర్సాను కూల్చివేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Madrassa Demolished : ఉగ్ర‌సంస్థ‌ల‌తో సంబంధాలున్న మదర్సా(Madrassa)లపై అసోం(Assam) ప్రభుత్వం స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశీ జిహాదీ సంస్థలతో సంబంధం ఉన్న మదర్సా నిర్మాణాలను తొలగించిన అసోం ప్రభుత్వం తాజాగా మరో మదర్సాను కూల్చివేసింది. బొంగైగావ్ జిల్లాలోని కబితరీ గ్రామంలోని కబైతరి మా-ఆరిఫ్ మదర్సా(Kabaitari Ma Arif Madrassa)కు బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ అల్ కాయిదాతో సంబంధాలున్నట్లు నిర్థారించుకున్న అధికారులు బుధవారం మదర్సాను నేలమట్టం చేశారు. మంగళవారం రాత్రి మదర్సా భవంతిని బుల్డోజర్‌తో కూల్చివేయడం ప్రారంభించగా.. బుధవారం ఉదయం వరకు భవనం కూల్చివేత పనులు కొనసాగాయి. తీవ్రవాదులతో సంబంధాలు కలిగి జిహాదీ కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు, ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ మదర్సాని నిర్మించారని, అందుకే కూలుస్తున్నామని డీఎస్పీ స్వప్నానీల్ డేకా తెలిపారు. ఒక్క అసోంలోనే కూల్చివేతకు గురైన మదర్సా భవంతుల్లో ఇది మూడోది కావడం విశేషం. జిహాదీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని మదర్సాను కూల్చివేసినట్లు అధికారులు చెప్పారు.ఈ మదర్సా కూల్చివేతకు ముందు అందులోని నుంచి విద్యార్థుల‌ను ఖాళీ చేయించి.. ఇతర విద్యాసంస్థలకు పంపించారు. గతంలో ఈ మ‌ద‌ర్సాకు ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలున్నాయ‌ని ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో పోలీసులు ఈ మదర్సాపై దాడులు చేయ‌గా నిషేధిత ఉగ్రవాద గ్రూప్ కు సంబంధించిన ప‌లు పత్రాలు, ప్ర‌చార ప్ర‌తులు ల‌భ్య‌మ‌య్యాయి. తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంగా హఫిజర్ రెహమాన్ అనే మదర్సా టీచర్‌ను ఈ నెల 26న అరెస్ట్ చేయగా, గోల్పారా జిల్లాలో ఇద్దరు ఇమామ్‌లను అరెస్టు చేశారు. అంతకుముందు బంగ్లాదేశ్‌ ఉగ్రవాద సంస్థ అన్సరుల్‌ ఇస్లాంతో సంబంధాలున్న కేసులో అరెస్టైన ముఫ్తీ ముస్తాఫాకు చెందిన బార్‌పేట జిల్లాలోని ఢక్లియాపరా ప్రాంతంలోని ఉన్న‌షేఖుల్ హింద్ మహ్మదుల్ హసన్ జామియుల్ హుదా అనే మదర్సాను సోమవారం తెల్లవారుజామున ప్రభుత్వం కూల్చివేసింది. ఈ మదర్సా కేంద్రంగా ముఫ్తీ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అభియోగాలు మోపారు.


వామ్మో... ఉపాధ్యాయులను ఇష్టమోచ్చినట్లు తిట్టి, వాష్ రూమ్ లో బంధించారు.. ఎందుకో తెలుసా..?
అసోం జిహాదీ కార్యకలాపాలకు స్థావరంగా మారిందని మదర్సా కూల్చివేత తర్వాత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విలేకర్ల సమావేశంలో అన్నారు. . గత అయిదు నెలల్లో అన్సరుల్‌తో సంబంధమున్న అయిదు స్థావరాలపై దాడులు నిర్వహించి జిహాదీ కార్యక్రమాలతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

First published:

Tags: Assam

ఉత్తమ కథలు