Home /News /national /

MADRAS HIGH COURT REAFFIRMS WHATSAPP GROUP ADMIN ISNT LIABLE FOR A MEMBERS POSTS GH VB

Videos And Photos: అటువంటి వీడియోలకు, ఫొటోలకు వాళ్లు బాధ్యులు కారు.. హైకోర్టు సంచలన తీర్పు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Videos And Photos: వాట్సాప్ గ్రూప్ మెంబర్లు పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌కు, మెసేజ్‌లకు గ్రూప్ అడ్మిన్లను బాధ్యులను చేయరాదని ఓ పాత కేసులో బాంబే హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఐతే ఈ తీర్పును ప్రస్తావిస్తూ మెంబర్ల నేరంలో అడ్మిన్లను బాధ్యుల్ని చేయొద్దని మధురై ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఇంకా చదవండి ...
వాట్సాప్ గ్రూపులో మెంబర్స్ షేర్ చేసే వివాదాస్పద, విద్వేషపూరిత పోస్టులకు గ్రూప్ అడ్మిన్లు బాధ్యులను చెయ్యకూడదని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తాజాగా పునరుద్ఘాటించింది. వాట్సాప్ గ్రూప్ మెంబర్లు పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌కు, మెసేజ్‌లకు గ్రూప్ అడ్మిన్లను బాధ్యులను చేయరాదని ఓ పాత కేసులో బాంబే హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఐతే ఈ తీర్పును ప్రస్తావిస్తూ మెంబర్ల నేరంలో అడ్మిన్లను బాధ్యుల్ని చేయొద్దని మధురై ధర్మాసనం తేల్చిచెప్పింది. ఒక లాయర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సందర్భంలో ఈ తీర్పును వెలువరించింది మధురై ధర్మాసనం.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ సిటీకి చెందిన రాజేంద్రన్ అనే లాయర్ 'కరూర్ లాయర్స్' అనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఈ గ్రూపులో ఆయన అడ్మిన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే అందులో ఉన్న ఒక మెంబర్స్ కాంట్రవర్షియల్ పోస్టును షేర్ చేశారు. ఈ పోస్టు వర్గాల మధ్య అల్లర్లు, ఘర్షణలను ప్రేరేపించేలా ఉంది.

Narendra Modi: మోదీ కాన్వాయ్​లో కొత్త లగ్జరీ కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!


దాంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు అయింది. ఈ కేసులో రాజేంద్రన్ పేరును కూడా పోలీసులు చేర్చారు. కానీ ఈ వివాదాస్పద పోస్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను కేవలం గ్రూప్ అడ్మిన్‌గా మాత్రమే ఉన్నానని.. వివాదాస్పద పోస్ట్ చేసిన వ్యక్తిని గ్రూప్ నుంచి డిలీట్ కూడా చేశానని.. అందువల్ల తనని కేసు నుంచి తొలగించాలని రాజేంద్రన్ మధురై కోర్టును ఆశ్రయించారు.

తనపై ఫైల్ చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని రాజేంద్రన్ ఫైల్ చేసిన పిటిషన్‌పై తాజాగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పు గురించి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ప్రస్తావించారు. గ్రూప్ సభ్యులు చేసిన నేరంతో అడ్మిన్‌కు ఎలాంటి సంబంధం లేనట్లయితే ఆ అడ్మిన్‌ని నిందితుల జాబితా నుంచి తప్పనిసరిగా తొలగించాలని బాంబే హైకోర్టు కిషోర్ అనే వ్యక్తి కేసులో తీర్పునిచ్చింది. ఇదే తీర్పును స్వామినాథన్ సమర్థిస్తూ గ్రూప్ మెంబర్ చేసిన అభ్యంతరకరమైన, నేరపూరితమైన, విద్వేష పూరితమైన పోస్టుకు అడ్మిన్ జవాబుదారీ కాదని స్పష్టం చేశారు.

ఐతే ఫిర్యాదుదారు ప్రకారం, పిటిషనర్ రాజేంద్రన్ అబద్ధాలు వల్లిస్తున్నాడు. గ్రూప్ అడ్మిన్, గ్రూప్ మెంబర్ మధ్య ఏదో సీక్రెట్ ప్లాన్ ఉండి ఉంటుందని ఫిర్యాదుదారు ఆరోపించారు. రాజేంద్రన్ తన గ్రూపు మెంబర్ ని మొదట గ్రూప్ నుంచి తొలగించి, ఆపై మళ్లీ యాడ్ చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ ఆరోపణలను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ బాధ్యతపై ఇదే విధమైన కేసును చర్చించిన బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలని మద్రాసు కోర్టు ఫిర్యాదుదారుకి సూచించింది.

Omicron: ఒమిక్రాన్ ను వీటితో చెక్ పెట్టొచ్చు.. అద్భుతంగా పనిచేస్తుందంటున్న ఒమిక్రాన్​ నుంచి కోలుకున్న రోగులు..


అయితే వాట్సాప్ గ్రూప్ లో జరిగిన కాన్వర్జేషన్ కు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ కేసులో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ రాజేంద్రన్ పాత్ర లేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలితే.. అతన్ని ఛార్జిషీట్ నుంచి తప్పనిసరిగా తొలగించాలని జస్టిస్ జీఆర్ స్వామినాథన్ పేర్కొన్నారు. ఒకవేళ ఇందులో అతని పాత్ర ఉన్నట్లు తేలితే మాత్రం అతను చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Published by:Veera Babu
First published:

Tags: Hot Photoshoot, Videos share, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు