వైన్ షాప్‌లు బంద్.. హైకోర్టు సంచలన ఆదేశాలు

మద్యం షాపుల నిర్వహణ తీరుపై MNM అధినేత, సినీనటుడు కమల్ హాసన్‌తో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారించిన మద్రాస్ హైకోర్టు మద్యం షాపులను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

news18-telugu
Updated: May 8, 2020, 7:38 PM IST
వైన్ షాప్‌లు బంద్.. హైకోర్టు సంచలన ఆదేశాలు
క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.
  • Share this:
తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. కేవలం ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలకు చేపట్టాలని... ఇంటికే మద్యం సరఫరా చేయేాలని స్పష్టం చేసింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పరేషన్ ద్వారా నడిచే అన్ని షాపులను మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు. తమిళనాడులో నిన్నటి నుంచే మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. ఐతే లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలను పట్టించుకోకుండా మందు బాబులు ఎగబడ్డారు. పెద్ద సంఖ్యలో గుమిగూడి క్యూ కట్టారు. మాస్క్‌లు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా.. మద్యం కోసం పోటీపడ్డారు.

మద్యం షాపుల నిర్వహణ తీరుపై MNM అధినేత, సినీనటుడు కమల్ హాసన్‌తో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన జస్టిన్ వినీత్ కొటారి, జస్టిస్ పుష్ప సత్యానారాయణ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్.. వైన్ షాపులను మూసివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేవలం ఆన్‌లైన్ అమ్మకాలకు మాత్రమే అనుమతిచ్చింది.




లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలను తమిళనాడు ప్రభుత్వం మే 7 నుంచి తిరిగి ఓపెన్‌ చేసింది. లాక్‌డౌన్‌ అనంతరం తెరుచుకున్న మొదటి రోజే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక్క రోజే తమిళనాడు ప్రభుత్వం రూ.150 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిపినట్లు తేలింది. కేంద్రం లాక్‌డౌన్‌ సడలింపుల ఇవ్వడంతో కంటైన్మెంట్‌ జోన్లు మినహా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలోనూ లిక్కర్‌ సేల్స్‌కు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే చెన్నైలో కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల గ్రేటర్‌ చెన్నై ప్రాంతంలో మాత్రం మద్యం అమ్మకాలను నిషేధించింది
Published by: Shiva Kumar Addula
First published: May 8, 2020, 7:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading