హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Online Gambling: కొహ్లి, రానా, తమన్నాలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే..

Online Gambling: కొహ్లి, రానా, తమన్నాలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే..

విరాట్ కోహ్లి, రానా దగ్గుబాటి (ఫైల్ పోటో)

విరాట్ కోహ్లి, రానా దగ్గుబాటి (ఫైల్ పోటో)

Online Gambling: ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అలాంటి వాటిని డబ్బుల కోసం ఎలా ప్రోత్సహిస్తారని నటులు, క్రికెటర్లను మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది.

  దేశంలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై ఓ పక్క ప్రభుత్వాలు నిషేధాలు విధిస్తున్నాయి. మరోవైపు వీటిని ప్రొత్సహించే విధంగా వ్యవహరించిన సెలబ్రిటీలకు చిక్కులు మొదలయ్యాయి. ఆన్‌లైన్ రమ్మీ, జంగ్లీ, రమ్మీ సర్కిల్, ఎంపీఎల్ లాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్‌లతో పాటు నటి తమన్నాపై మద్రాస్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆత్మహత్యలకు కారణమవుతున్న ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ కోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 19లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ వారికి నోటీసులు జారీ చేసింది.

  ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అలాంటి వాటిని డబ్బుల కోసం ఎలా ప్రోత్సహిస్తారని నటులు, క్రికెటర్లను మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు మద్రాస్ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ రద్దు చేయడానికి 10 రోజులు సమయం కావాలని హైకోర్టును కోరింది.

  ఇదిలా ఉంటే ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడే 132 వెబ్‌సైట్లను ఏపీలో నిషేధించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కొద్దిరోజుల క్రితం లేఖ రాశారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడటాన్ని నేరంగా పరిగణించే విధంగా ఏపీలో చట్టం చేశామని తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ కేంద్రమంత్రి లేఖ రాశారు. ఈ రకమైన వాటి వల్ల సమాజంలో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వీటికి అలవాటు కావడం వల్ల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో పాటు అనేక మానసిక, సామాజిక రుగ్మతులు ఏర్పడుతున్నాయని కేంద్రమంత్రికి రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.

  ఈ కారణంగానే వీటిని రాష్ట్రంలో నిషేధించేలా ఏపీ గేమింగ్ యాక్ట్ 1974లో సవరణలు చేశామని తెలిపారు. ఈ కొత్త చట్టం ప్రకారం ఇలాంటివన్నీ ఏపీలో శిక్షార్హమైన నేరాలని.. వీటికి నిర్వహించే కంపెనీల డైరెక్టర్లు కూడా శిక్షార్హులే అని వివరించారు. వీటికి సహకరించే వాళ్లు కూడా శిక్షార్హులే అనే విధంగా చట్టంలో మార్పులు చేశామని సీఎం జగన్ లేఖలో వెల్లడించారు. ఈ క్రమంలోనే వీటిని బ్లాక్ చేయని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా శిక్షార్హులే అవుతారని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగానే ఏపీలో ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడే 132 వెబ్‌సైట్లను బ్లాక్ చేసే విధంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Madras high court, Rana daggubati, Tamannah, Virat kohli

  ఉత్తమ కథలు