Home /News /national /

Vidhisha: బాలుడిని రక్షించేందుకు వెళ్లి బావిలో పడ్డ 25 మంది.. తీవ్ర విషాదం..

Vidhisha: బాలుడిని రక్షించేందుకు వెళ్లి బావిలో పడ్డ 25 మంది.. తీవ్ర విషాదం..

బావి వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

బావి వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 25 మందికి పైగా బావిలో పడిపోయారు.

    మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 25 మందికి పైగా బావిలో పడిపోయారు. బావిలో పడ్డ బాలుడిని వెలికి తీసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. గంజ్‌ బసోడలో ఓ బాలుడు బావిలో పడిపోయినట్టుగా సమాచారం. అతన్ని కాపాడటానికి గ్రామ ప్రజలు బావి వద్దకు చేరారు. బావి వద్ద పెద్ద ఎత్తున జనం చేరడంతో.. బావి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దాదాపు 25 మందికి పైగా బావిలో పడిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 3 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరికొందరిని ప్రాణాలతో రక్షించారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

    బావిలో పడిపోయిన మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. విదిష ఇంచార్జ్ మంత్రి విశ్వాస్ సారంగ్.. ఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బావిలోని నీటిని బయటకు పంపింగ్ చేస్తున్నట్టు మంత్రి విశ్వాస్ సారంగ్ చెప్పారు.





    డీజీపీ వివేక్ జోషి మాట్లాడుతూ.. బావిలో ఎంత మంది పడిపోయారనే దానిపై స్పష్టత లేదని చెప్పారు. ఇక, ప్రస్తుతం సీఎం శివరాజ్‌ సింగ్ కూడా విదిష జిల్లాలోనే ఉన్నారు. ఆయన దత్త పుత్రికల వివాహం కోసం జిల్లాకు వచ్చారు. అక్కడి నుంచే ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Madhya pradesh, Shivraj Singh Chouhan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు