హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

బాలిక దుస్తులు విప్పించి.. స్కూల్లోనే ఉతికిన టీచర్.. గంటల పాటు అర్ధ నగ్నంగానే విద్యార్థిని

బాలిక దుస్తులు విప్పించి.. స్కూల్లోనే ఉతికిన టీచర్.. గంటల పాటు అర్ధ నగ్నంగానే విద్యార్థిని

బట్టలు ఉతుకుతున్న టీచర్

బట్టలు ఉతుకుతున్న టీచర్

ఐదో తరగతి బాలిక స్కూల్‌కు మురికి దుస్తులతో వచ్చింది. ఎప్పుడూ పరిశుభ్రత గురించి మాట్లాడే... ఓ టీచర్‌కు ఇది అస్సలు నచ్చలేదు. అంతటితో ఆగలేదు. స్కూల్లోనే బట్టలు ఉతికాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  పరిశుభ్రత గురించి స్కూల్ పిల్లలకు టీచర్లు పాఠాలు చెబుతారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. ఉతికిన దుస్తులనే ధరించాలని.. మంచి విషయాలను బోధిస్తారు. విద్యార్థులు ఎవరైనా మురికి దుస్తుల్లో కనిపిస్తే వారిని మందలిస్తుంటారు. ఐతే పరిశుభ్రత విషయంలో ఓ స్కూల్ టీచర్ (School Teacher)  చేసిన పని.. ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.  ఓ బాలిక బట్టలు మురికిగా ఉండడంతో.. ఆమె దుస్తులను విప్పించి.. స్కూల్‌లోనే ఉతికాడు. అవి ఆరే వరకు గంటల తరబడి ఆ విద్యార్థినిని అర్ధనగ్నంగానే ఉంచాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతడి ఉద్దేశం మంచిదే.. కానీ చెప్పిన విధానమే అస్సలు బాగాలేదు. ప్రచారం కోసం ప్రయత్నించి.. పరువు పోగొట్టుకున్నాడు. చివరికి విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని షాడోల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

  Trending: ప్రభుత్వ ఉద్యోగమున్నా డోంట్ కేర్.. సొంత సెలూన్ ఉంటేనే పిల్లనిస్తారట.

  స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. షాడోల్ జిల్లాలోని జైసింగ్ నగర్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఐతే ఇటీవల ఓ ఐదో తరగతి బాలిక స్కూల్‌కు మురికి దుస్తులతో వచ్చింది. ఎప్పుడూ పరిశుభ్రత గురించి మాట్లాడే... ఓ టీచర్‌కు ఇది అస్సలు నచ్చలేదు. ఆ బాలికకు క్లాస్ తీసుకున్నాడు. అంతటితో ఆగలేదు.. ఆమె బట్టలు విప్పించి.. స్కూల్ ఆవరణలోనే సబ్బు పెట్టిమరీ ఉతికాడు. దుస్తులు పూర్తిగా ఆరిన తర్వాత.. ఆ విద్యార్థిని మళ్లీ వాటిని ధరించింది. అప్పటి వరకు గంటల తరబడి అర్ధనగ్నంగానే ఉంచారు. బాలిక దుస్తులను ఉతికిన ఫొటోలను సదరు ఉపాధ్యాయుడు.. డిపార్ట్‌మెంటల్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. క్లీన్ ఫ్రెండ్ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. అలా ఆ ఫొటో వైరల్ అయింది.

  ఈ విషయం బయటకు పొక్కడంతో గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదో తరగతి చదువుతున్న బాలికను.. గంటల తరబడి అర్ధనగ్నంగా నిలబెడతారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్కూల్ టీచర్ తీరుపై విద్యార్థి సంఘాలు కూడా మండిపడ్డాయి. విద్యార్థిని పరువుకు భంగం కలిగించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్.. ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీచేశారు. షాడోల్ జిల్లాలో ఈ తరహా ఘటనలు గతంలోనూ జరిగాయి. విద్యార్థులతో మరుగుదొడ్లను శుభ్రం చేయించడం, పొలం పనులు చేయించడం వంటి ఘటనలు వెలుగుచేశాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Madhya pradesh, Trending, VIRAL NEWS

  ఉత్తమ కథలు