హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

గాఢ నిద్రలో ఉన్న భర్తపై అమానుషం.. సల సల కాగుతున్న నూనె పోసిన భార్య.. ఎందుకో తెలుసా..?

గాఢ నిద్రలో ఉన్న భర్తపై అమానుషం.. సల సల కాగుతున్న నూనె పోసిన భార్య.. ఎందుకో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Madhya Pradesh: భర్త అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. భార్యభర్తలు కూడా చాలా సేపు గొడవ పడ్డారు. కాసేపటికి భర్త నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే భార్య భర్తపై దాడికి తెగబడింది.

  • Local18
  • Last Updated :
  • Madhya Pradesh, India

కొందరు భార్యభర్తలు చిటీకి మాటికి గొడవలు పడుతుంటారు. ప్రతి చిన్న విషయానికి తగువులాడుకుంటారు. కొంత మంది భర్త.. డబ్బులు సంపాదించడం లేదని, తమని బాగా చూసుకొవట్లేదని భర్తలతో గొడవలు పడుతుంటారు. ఇక.. మరోవైపు భర్తలు కూడా.. తమ భార్యలు కట్నం తేలేదని, వంటలు సరిగ్గా చేయడం లేదని సాగుతో వాగ్వాదానికి దిగుతుంటారు. కొన్ని చోట్ల వివాహేతర సంబంధాలు, ఆర్థిక సమస్యలతో దంపతుల మధ్య గొడవు వస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని సందర్భాలలో కంట్రోల్ తప్పి.. పరస్పరం దాడులు చేసుకొవడం, హత్యలు చేసుకొవడం వరకు వెళ్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh) షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. రేవా జిల్లాలోని నైగర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని భీర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మరిగే నూనె పోయడంతో ఓ వ్యక్తి పూర్తిగా కాలిపోయాడు. హుటాహుటిన బంధువులు అతడిని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో గొడవల కారణంగా భార్య స్వయంగా తన భర్తపై మరుగున ఆవనూనె పోసిందని, దీంతో అతని ముఖం బాగా కాలిపోయిందని చెబుతున్నారు.

పోలీసుల ప్రకారం.. భీర్ గ్రామానికి చెందిన రమేష్ సాకేత్ అనే వ్యక్తి తన భార్యతో ఇంట్లోని సమస్యలపై గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దీంతో ఇద్దరు గొడవ పడి, కొట్టుకొవడం వరకు వెళ్లింది. కొంతసేపటి తర్వాత గొడవ పడి అలిసి పోయిన భర్త నిద్రకు ఉపక్రమించాడు. కానీ భార్య కోపం పీక్స్ కు చేరింది. నిద్రిస్తున్న భర్తపై ఒక్కసారిగా మరుగుతున్న నూనె పోసింది. వెంటనే రమేష్ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. అతని అరుపులు విన్న చుట్టుపక్కల ఉన్నఇళ్లలో బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చూసి వెంటనే బాధితుడు రమేష్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం సంజయ్ గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు.

ప్రస్తుతం సంజయ్ గాంధీ ఆస్పత్రిలో ఆమె భర్తకు చికిత్స కొనసాగుతోంది. కాగుతున్న నూనె వల్ల శరీరంలోని చాలా భాగాలు కాలిపోయాయని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో ముఖం కాలిపోవడంతో రమేష్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Family dispute, Madhya pradesh

ఉత్తమ కథలు