హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

చోరీ చేసి అడ్డంగా బుక్కైన ఆర్టిస్ట్.. ఓనర్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..

చోరీ చేసి అడ్డంగా బుక్కైన ఆర్టిస్ట్.. ఓనర్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..

బాధితుడు అవినాష్ తివారీ(ఫైల్)

బాధితుడు అవినాష్ తివారీ(ఫైల్)

Madhya Pradesh: రేవాలో అవినాష్ తివారీ అనే వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టి రూ. 2 లక్షలను దొంగ ఎత్తుకెళ్లాడు. అయితే ఫిర్యాదు చేసిన 6 గంటల్లోనే పోలీసులు దొంగను పట్టుకున్నారు.

  • Local18
  • Last Updated :
  • Madhya Pradesh, India

కొందరు తరచుగా చోరీలకు పాల్పడుతుంటారు. అయితే.. వీరిలో కొందరు ఆర్థిక పరిస్థితులు బాగాలేక, సరైన ఉద్యోగం దొరక్క చోరీల బాటలు పడుతుంటారు. కానీ మరికొందరు దీనికి విరుద్ధంగా జల్సాలకు అలవాటు పడి తరచుగా చోరీలు చేస్తుంటారు. అయితే.. ట్యాలెంట్ ఉండి కూడా కొంత మంది యువత కొంత మంది చెడు మార్గాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో వారు ప్రొఫెషన్ ల్ నేరస్థులు కాదు.. అందుకే ఇట్టే తప్పులు చేసి దొరికిపోతుంటారు. ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh)  రేవా ప్రాంతంలో తన ఇంటి ముందు.. రాత్రి కార్ పార్క్ చేసిన వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. ప్రతిరోజు లాగే అవినాష్ తివారి అనే వ్యక్తి తన కారును ఇంటి ముందు పార్క్ చేశాడు.అయితే.. ఆరోజు కారులో రూ.2 లక్షలను అలాగే ఉంచేశాడు. జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ఏమౌతుందో అనుకున్నాడో ఏమో కానీ ఆరోజు అనుకొని సంఘటన జరిగింది.

ఉదయం కారును చూసే సరికి అది పూర్తిగా ధ్వంసమైఉంది. కారు అద్దాలు పగులగొట్టి, అందులోని డబ్బులను ఎవరో తీసుకెళ్లిపోయారు. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ తర్వాత.. వెంటనే అక్కడ అద్దెకు ఉంటున్న యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు. తమదైన రీతిలో ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు చాకచక్యంగా కేవలం 6 గంటల్లోనే దొంగను పట్టుకున్నారు.

దొంగ వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్

చోరికి పాల్పడిన రాంబాహోర్ .. వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్.. అంతే కాకుండా పెయింటింగ్ కూడా వేస్తుంటాడు. కాగా, అవినాష్ తివారీ డబ్బులతో ఉన్న బ్యాగ్‌ని కారులో ఉంచడం అతను చూశాడు. ఇంద్రనగర్‌లోని సూర్య ప్రకాష్ తివారీ ఇంట్లో అవినాష్ తివారీ అద్దె గదితో నివసిస్తున్నాడు. ఫిర్యాదుదారు ఇల్లు డాక్టర్ మన్మోహన్ సింగ్ క్లినిక్ సమీపంలో ఉంది.

అవినాష్ తివారీ ఎప్పటిలాగే తన కారును బయట పార్క్ చేసి గదిలోకి వెళ్లాడు. గురువారం రాత్రి బ్యాగ్ తీసుకోవడం మర్చిపోయాడు. అప్పుడు అవకాశం కోసం వేచి ఉన్న దొంగ, అతని పేరు అభిషేక్ పటేల్ కుమారుడు రాంబాహోర్, 23 సంవత్సరాలు, కారులో ఉంచిన బ్యాగ్‌ను తీసుకెళ్లాడు.

స్వయంగా బెయిల్ ఇప్పించిన బాధితుడు..

దొంగ అరెస్ట్ తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆర్టిస్ట్ అవినాష్ తివారీ.. దొంగతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి నిందితుడికి బెయిల్ కూడా ఇచ్చాడు.నిరుద్యోగం, పేదరికం కారణంగా నిందితుడు ఇలాంటివి తీసుకోవలసి వచ్చిందని అవినాష్ చెప్పాడు.

అందుకే నిందితులకు మేమే బెయిల్ ఇప్పించినట్లు తెలిపాడు. కేసు కూడా రిటర్న్ తీసుకున్నట్లు తెలిపాడు. వాహనానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని నిందితుల బంధువులు కోరగా, వారి నుంచి కూడా డబ్బులు తీసుకోలేదు. ప్రస్తుతం కారు యజమాని చూపిన మంచి మనసుకు స్థానికులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

First published:

Tags: Madhya pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు