ఉత్తరాన మహా రైతు గర్జన

news18
Updated: June 6, 2018, 6:13 PM IST
ఉత్తరాన మహా రైతు గర్జన
రైతుల ఆందోళన-ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: June 6, 2018, 6:13 PM IST
  • Share this:
మొన్నామధ్య మహారాష్ట్ర రైతులు మహా పాదయాత్రతో రాష్ట్రాన్ని షేక్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసి యావత్ దేశం ద్రుష్టిని ఆకర్షించారు. అదే స్ఫూర్తితో ఉత్తర భారతంలో మరో పోరాటానికి సిద్దమయ్యారు రైతులు.  మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, హర్యానా,  చత్తీస్ గఢ్, కర్నాటక రాష్ట్రాల్లో  ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు సమ్మె చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూరగాయలు, పాలు సరఫరాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ నిలివేయనున్నారు. రైతు సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చిన ఆ రైతు సహాయ నిరాకరణోద్యమానికి శ్రీకారం చుట్టారు.

మంద్‌సౌర్ కాల్పులకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సమ్మెకు పిలుపునిచ్చారు రైతులు. గతేడాది జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో రైతులుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆరుగురు రైతులు చనిపోయారు. ఈ నేపథ్యంలో నాటి సంఘటనను నిరసిస్తూ ఇప్పుడు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఒకే విడతలో రుణమాఫీతో పాటు కనీస మద్దతు ధరను కల్పించాలని కోరుతున్నారు. ఐతే మహారాష్ట్రలో ఆందోళనకు నేత్రుత్వం వహించిన స్వాభిమాన్ షెట్కారీ సంఘటనతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్ధైన భారతీయ కిసాన్ సంఘ్ మాత్రం దీనికి దూరంగా ఉంది.

ఐతే రైతు ఉద్యమాన్ని పోలీసులు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్ట్రైక్‌లో పాల్గొనకుండా తమతో బాండ్ పేపర్ రాయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ' రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించేందుకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అదనపు బలగాలను కూడా తెప్పిస్తున్నారు. పోలీసుల తీరును చూస్తే యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు అనిపిస్తోంది. మేం సాధారణ రైతులం. న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాం' అని అనిల్ యాదవ్ అనే రైతు తెలిపాడు.

సమ్మెను విజయవంతం చేయాలని వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపిస్తున్నాయి రైతు సంఘాలు. పోలీసులు ఉద్యమాన్ని అణచివేసే హింసకు పాల్పడితే జైల్ భరో చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌ల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టంచేశారు. గాంధీ సూచించిన శాంతియుత మార్గంలోనే నిరసనలు తెలుతామని అన్నారు.కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జూన్ 6న మాంద్‌సౌర్‌లో పర్యటించనున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 1, 2018, 5:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading