గేదె చేసిన పనికి రైతుకు రూ.10,000 ఫైన్... మరి అతను ఆ జరిమానా చెల్లించాడా?

గేదె చేసిన పనికి రైతుకు రూ.10,000 ఫైన్... (ప్రతీకాత్మక చిత్రం)

పొలం పనులు చేసుకొని బతికే ఆ రైతుకి రూ.10,000 ఫైన్ కడ్డటం అంటే మాటలా... అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికారుల తీరుతో అతను ఏం చేశాడు?

 • Share this:
  మీరు గేదెలు, ఆవులు, పిల్లులు, కుక్కల వంటి జంతువుల్ని పెంచుకుంటున్నారా... ఐతే... మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ పెంపుడు జంతువును ఇష్టం వచ్చినట్లు వదిలేస్తే... ఆ ఆ తర్వాత లేని పోని చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే... రూ.10వేల ఫైన్ అంటే మాటలా... కొంత మంది నెలవారీ సంపాదన అది. అంతంత ఫైన్ చెల్లించడం అంటే కష్టమైన పనే. అసలే కరోనా కష్టకాలం. ఈ షాకింగ్ ఘటన జరిగింది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో. అక్కడ బేతాళ్ సింగ్ అనే రైతు పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. తాజాగా మున్సిపల్ అధికారులు ఆయన ఇంటికి వచ్చి... వాళ్లలో వాళ్లే... "అవును అదే... ఆ గేదే... సీసీ ఫుటేజ్‌లో క్లియర్‌గా ఉంది" అనుకుంటూ అతనికి రూ.10,000 ఫైన్ వేశారు.

  అందుకని అంత ఫైన్ వేసారా?
  బేతాళ్ సింగ్ గేదెలు తరచూ రోడ్డుపైకి వచ్చేస్తూ ఉంటాయి. తాజాగా ఆ రోడ్డును మున్సిపల్ అధికారులు క్లీన్ చేశారు. ఎవరు చెత్త వేసినా ఫైన్ వేస్తామని హెచ్చరించారు. ఇది గమనించని ఆ రైతు ఎప్పటిలాగే... తన గేదెలను రోడ్డుపై తోలుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. దురదృష్టం కొద్దీ ఓ గేదె రోడ్డుపై పేడ వేసింది. మర్నాడు ఆ పేడను చూసిన అధికారులు... "అయ్యో... మనం ఎంత చెప్పినా వినరు. చూడు రోడ్డంతా ఎలా అయిపోయిందో. ఈ పని చేసింది ఎవరు" అనుకుంటూ సీసీటీవీల్లో ఫుటేజ్ చూశారు. అందులో అంతా కనిపించింది. దాంతో... ఆ గేదె ఎవరిదో గుర్తించి... ఆ రైతును కనిపెట్టి... ఫైన్ వేశారు.

  "సిటీ అంతటా క్లీనింగ్ చర్యలు కొనసాగుతున్నాయి. వీధులు శుభ్రంగా ఉంచాలని ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలు జరుపుతోంది. ఎక్కడా ఎవరూ చెత్త వెయ్యకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం" అని మున్సిపల్ కార్పొరేషన్ అధికారి మనీష్ కనసుజియా తెలిపారు.

  "రోడ్డు క్లీన్ చేసే కొన్ని రోజుల ముందు నుంచీ ఆ రైతుకు చెబుతూనే ఉన్నాం. రోడ్డుపైకి గేదెలను వదలొద్దని చెప్పాం. కానీ అతను మా మాట వినలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఫైన్ వేశాం" అని ఆమె తెలిపారు.

  ఫైన్ చెల్లించిన రైతు:
  ఓ రైతు రూ.10,000 జరిమానా చెల్లించడం అంటే ఎంతో కష్టం. అలాంటిది బేతాళ్ సింగ్ మాత్రం... అధికారులకు ఎదురు తిరగలేదు. మొనంగా ఫైన్ చెల్లించాడు. కనీసం చిన్న మాట కూడా ఎదురు చెప్పలేదు. అందుకే అందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు.

  ఇది కూడా చదవండి: Yearly Horoscope: కొత్త సంవత్సరం 2021లో ఏ రాశి ఫలాలు ఎలా ఉంటాయి? తెలుసుకోండి

  మన దేశంలో రోడ్లపై చాలా మంది కావాలనే చెత్తా చెదారం వేస్తుంటారు. మద్యం తాగి... ఆ బాటిళ్లను రోడ్లపైనే పగలగొడతారు. అలాంటి వాళ్లకు ఎప్పుడూ ఇలాంటి భారీ ఫైన్లు వేసిన సందర్భాలు లేవు. కానీ ఓ సామాన్య రైతుకి చెందిన గేదె పేడ వేస్తే... ఆ రైతుకు రూ.10,000 ఫైన్ వేయడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  ప్రభుత్వం రోడ్లను క్లీన్ చేసేందుకు సోషల్ వర్కర్ల సాయం తీసుకంటోంది. ప్రజలు గ్వాలియర్ కోటకు... పాలిథిన్ కవర్లలో ఏవీ తేవొద్దని చెబుతున్నారు. రైతు చెల్లించిన జరిమానాను... అభివృద్ధి కార్యక్రమాలకు వాడుతామని అధికారులు తెలిపారు.
  Published by:Krishna Kumar N
  First published: